Wednesday, April 24, 2024

ఆ దర్శకుల స్క్రీన్ ప్లే స్ఫూర్తితో…

- Advertisement -
- Advertisement -

Movie ‘Family Drama’ starring Suhas as hero

 

సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ డ్రామా‘. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి దర్శకుడు మెహెర్ తేజ్ నిర్మించిన ఈ చిత్రం సోని లివ్ ఓటీటీలో గత నెల 29 తేది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందంటున్నారు హీరో సుహాస్, దర్శకుడు మెహెర్ తేజ్. ఈ సందర్భంగా దర్శకుడు మెహెర్ తేజ్ మాట్లాడుతూ…“డార్క్ కామెడీ జానర్‌లో మన దగ్గర సినిమాలు రావడం తక్కువ. రామ్ గోపాల్ వర్మ, హిచ్ కాక్ లాంటి దర్శకుల సినిమాల తరహా స్క్రీన్ ప్లే స్ఫూర్తితో ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆదరిస్తుండటంతో సంతోషంగా ఉంది. ఇందులో సుహాస్ చక్కగా నటించాడు. ఇక నా కొత్త సినిమా చర్చల్లో ఉంది”అని అన్నారు. సుహాస్ మాట్లాడుతూ “ఫ్యామిలీ డ్రామా చిత్రం నటుడిగా నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. గట్టిగా నవ్వడం, ఎమోషన్స్ పలికించే సందర్భాల్లో కష్టపడి నటించాను. ఒక్కోసారి తలనొప్పి వచ్చేది. ఇక నటుడిగా అన్ని రకాల కథల్లో, క్యారెక్టర్లలో నటించాలి అనేదే నా కోరిక. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News