Home తాజా వార్తలు తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలి

తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో నూతన విమానాశ్రయాలను నిర్మిస్తే భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం ఉందని టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ గౌడ్ కేంద్రప్రభుత్వానికి సూచించారు. మంగళవారం రాజ్యసభ ప్రశ్నాత్తరాల సమయంలో బండ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులను నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణలో అనేక నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో కొత్త ఏయిర్ పోర్టుల అవసరం పెరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి సారించిన నేపథ్యంలో తెలంగాణలో కొత్త ఏయిర్‌పోర్టులను ఏర్పాటి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కొత్తఏయిర్ పోర్టుల ఏర్పాటు పై కేంద్రం ప్రకటన చేయాలని ఆయన రాజ్యసభలో పట్టు బట్టారు. మమూనూరు, ఆదిలాబాద్, నిజమాబాద్, రామగుండం, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నిజాం కాలంలో నిర్మించిన ఏయిపోర్టులను తిరిగి పునరుద్ధరించాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఏయిర్ పోర్టులకోసం భూములు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

MP Banda Prakash urges to Centre new airports in TS