Friday, April 19, 2024

వరుడికి కరోనా.. పిపిఈ కిట్లు ధరించి వివాహం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

MP couple gets married in PPE kits

భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పిపిఈ కిట్లే పట్టు వస్త్రాలుగా ధరించి ఓ యువజంట ఒక్కటైన  సంఘటన మధ్యప్రదేశ్ లోని రత్లం పట్టణంలో చోటుచేసుకుంది. వేదమంత్రాల నుంచి అప్పగింత వరకు అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయితే, వరుడికి పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ,  కోవిడ్ నిబంధనల మధ్య ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పిపిఈ కిట్లు ధరించి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటతో పాటు, పూజారి, కొంతమంది కుటుంబసభ్యులు కూడా పిపిఈ సూట్లు ధరించి కనిపించారు. ఏప్రిల్ 19న వరుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తరువాత స్థానిక అధికారుల అనుమతితో కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు, ఆంక్షలు విధిస్తుండడంతో  చాలామంది వివాహలను వాయిదా వేసుకుంటున్నారు.

MP couple gets married in PPE kits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News