Home తాజా వార్తలు లబ్దిదారులకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

లబ్దిదారులకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

Maloth Kavitha

 

మహబూబాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధి(సిఎం రిలీఫ్‌ ఫండ్‌) చెక్కులను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు మాలోత్‌ కవిత లబ్దిదారులకు బుధవారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో ఎంపి మాలోత్ కవిత లబ్దిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యాధి బారిన పడి, చికిత్సకు నోచుకోలేని నిరుపేదల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తుందని ఆమె తలిపారు. ఈ సందర్భంగా లబ్దిదారులు.. సిఎం కెసిఆర్‌, ఎంపి మాలోత్‌ కవితకు  కృతజ్ఞతాలు తెలిపారు.

MP distributes CMRF cheques in Mahabubabad
MP Provided CM Relief Fun Checks to beneficiaries