Friday, April 19, 2024

ఎంపీలో ‘గుడ్ సామరిటన్ పథకం’ అమలు

- Advertisement -
- Advertisement -

road accident
భోపాల్: రోడ్డు ప్రమాదాల్లో ఎవరినైనా సకాలంలో కాపాడే పథకం ‘గుడ్ సామరిటన్ స్కీమ్’. ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే దసరా(అక్టోబర్ 15) నాడు ఈ పథకం మధ్యప్రదేశ్‌లో అమలులోకి వచ్చిందని రోడ్డు భద్రతకు చెందిన అదనపుపోలీస్ డైరెక్టర్ జనరల్(ఎడిజి) జి. జనార్దన్ వార్తా సంస్థకు తెలిపారు. ఈ పథకం ప్రకారం ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే, వారిని ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించి కాపాడితే వారికి ఈ పథకం కింద రూ. 5,000 బహుమతిగా ఇస్తారు.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారికి ఇది ఇతోధికంగా ప్రేరణనిస్తుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పార్లమెంటుకు తెలిపింది. వాటిలో 1,31,714 మంది చనిపోయారని కూడా తెలిపింది.

గుడ్ సామరిటన్ పథకం కింద రోడ్డు ప్రమాదంలో మెదడు, వెన్నెముక గాయాలయిన వారిని రక్షించిన వారికి నగదు బహుమతి లభిస్తుందని ఎడిజి తెలిపారు. అయితే ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్‌టిఒ), ప్రధాన ఆరోగ్య అధికారి, పోలీస్ సూపరింటెండెంట్, కలెక్టర్‌తో కూడిన కమిటీ కేసులను పరిశీలించి ఈ రివార్డులు ఇస్తుందన్నారు. మోటార్ చట్టం సెక్షన్ 2(12ఎ) కింద గోల్డెన్ అవర్ అంటే ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఇచ్చే చివరి గంట సమయం అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. ఒకవేళ ఇద్దరు కలిసి కాపాడితే బహుమతిని ఇద్దరికి చెరి సగం ఇస్తారు. ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో కూడా గుడ్ సామరిటన్స్ కింద కొందరిని ఎంపిక చేసి రివార్డులు ఇస్తారని, ఆ అవార్డు కింద రూ. లక్ష, ఓ ప్రశంసా పత్రం, ట్రోఫీని ఇస్తారని కూడా మధ్యప్రదేశ్ రోడ్ సేఫ్టీ ఎడిజి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News