Home తాజా వార్తలు వాళ్ల పాలనలో తెలంగాణ ఆగమైంది: కవిత

వాళ్ల పాలనలో తెలంగాణ ఆగమైంది: కవిత

MP Kavitha Speech About Party Activists in Nizamabad

నిజామాబాద్: 67 ఏళ్ల కాంగ్రెస్, టిడిపి పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేశారని ఎంపి కవిత విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల్ని అడుగడుగునా మభ్యపెట్టి టిడిపి, కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా పబ్బం గడిపారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2006 నుంచి 2011 వరకు ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటు చేసి ఒక్క పైసా ఇవ్వలేదని, గల్ఫ్ బాధితులకు ఆదుకునేందుకు గత ప్రభుత్వాలు చిన్న ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు. గల్ఫ్‌లో ఈ నాలుగేళ్లలో 1278 మంది చనిపోతే… అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చామని వివరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందస్తుగా ఆలోచన చేసి వలసలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. సొంత గ్రామాల్లో ఉపాధి చర్యలు తీసుకున్నామని కవిత కొనియాడారు.

MP Kavitha Comments on TDP and Congress

Telangana news