Home తాజా వార్తలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అరెస్టు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అరెస్టు

MP Komatireddy Venkat Reddyయాదాద్రి భువనగిరి : భువనగిరి ఎంపి, కాంగ్రెస్ అగ్రనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థలకు తక్షణమే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి జడ్ పి కార్యాలయం ఎదుట తమ పార్టీ కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకో చేస్తున్న కోమటిరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వెంకట్ రెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

MP Komatireddy Venkat Reddy Arrested By Police