Home జాతీయ వార్తలు తిరుపతి విమానాశ్రయంలో ఎంఆర్ఒ సెంటర్ ను ఏర్పాటు చేయాలి

తిరుపతి విమానాశ్రయంలో ఎంఆర్ఒ సెంటర్ ను ఏర్పాటు చేయాలి

MP Maddila gurumurthy talk on MRO center in lok sabha

 

న్యూఢిల్లీ: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మేయింటెనెన్స్ అండ్ ఓవర్హాలింగ్ (ఎంఆర్ఒ) సెంటర్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రాంభించాలని తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. కేంద్ర విమానయాన శాఖ ఎంఆర్ఒ సెంటర్ కి సంబంధించిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం ఎంఆర్ఒ సెంటర్ పనులు త్వరితంగా అమలు చేసేందుకు వెంటనే ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలన్నారు. ఈ రోజు లోకసభ లో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం గా తిరుపతి కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయం ను ఉడాన్ స్కిము కింద దేశంలోని ఇతర అన్ని నగరాల కు విమానయాన కనెక్టివిటీ ఇవ్వాలని కోరారు. లాజిస్టిక్ పార్క్ కూడా తిరుపతి విమానాశ్రయం లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.