Home ఖమ్మం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి నామ

పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి నామ

Nageshwara rao

 

ఖమ్మం: జిల్లాల్లోని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఎంపి నామా నాగేశ్వరరావు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను మొదటి స్థానంలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ నాయకులంతా సమన్వయంతో పని చేసుకుందామని, పార్లమెంట్ సమావేశాలతో బిజిగా ఉన్నందున జిల్లాకు రాలేకపోయాన్నారు. ఐదేళ్ల పాటూ జిల్లాను అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఎంపిటిసిపై మావోయిస్టుల దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎంపిటిసి శ్రీనివాస్ రావు మృతికి ఎంపి నామా నాగేశ్వర రావు సంతాపం తెలియజేశారు.

MP Nageshwara rao participate in TRS membership