Friday, March 29, 2024

మమతా బెనర్జీని వదిలి నితీశ్ చెంతకు చేరిన పవన్ వర్మ

- Advertisement -
- Advertisement -

 

Pavan Varma

పాట్నా:  బీహార్‌కు చెందిన జెడియూ మాజీ ఎంపీ పవన్‌ వర్మ శుక్రవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసికి రాజీనామా చేశారు. ఈ మేరకు టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా ‘మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. మీ ఆప్యాయత, మర్యాదలకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే, గతంలో జెడియూ అధినేత నితీశ్‌ కుమార్‌ బిజెపికి మద్దతు ఇవ్వడాన్ని పవన్‌ వర్మ తప్పుపట్టారు. ఈ సందర్భంలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీశ్‌ కుమార్‌ సమర్థించడాన్ని పవన్‌ వర్మ వ్యతిరేకించారు. . బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌పై నితీశ్‌ కుమార్‌ కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో, పవన్‌ వర్మను జెడియూ సస్పెండ్‌ చేసింది. అనంతరం, ఆయన మమత నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌లో చేరారు. కాగా, తాజాగా నితీశ్ కుమార్‌.. బిజెపికి గుడ్‌ బై చెప్పడంతో పవన్‌ వర్మ టిఎంసి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మళ్లీ పవన్‌ వర్మ నితీష్‌ గూటికి చేరుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పవన్‌ వర్మ టిఎంసిలో చేరి ఏడాది కూడా కాకపోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News