Friday, April 19, 2024

భార్యపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారి… (వీడియో)

- Advertisement -
- Advertisement -

Police-Beats-Wife

భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ పోలీసు అధికారి దారుణానికి ఒడిగట్టాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందంటూ కట్టుకున్న భార్యపై విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డాడు.  భార్యను రోడ్డుపైకి ఈడ్చుకోచ్చి విచాక్షణ రహితంగా కొట్టాడు. చుట్టుపక్కల అందరూ చూస్తూనే ఉన్నారూ కానీ.. ఎవరు ఈ దారుణాన్ని అడ్డుకోలేదు. వివరాల్లోకి వెళితే… గాంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నరేంద్ర సూర్యవంశీ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య అతడిని ప్రశ్నించగా అమెపైకి దాడికి దిగాడు. దీంతో స్టేషన్ ఇంఛార్జ్ సూర్యవంశీని విధుల నుంచి తప్పించినట్టు తెలిపిన ఉన్నతాధికారులు దాడితో సహా వివాహేతర సంబంధం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video Courtesy by True Scoop TV

https://youtu.be/aSLHCR695LU

MP Police thrashes wife in public at Dhar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News