Home తాజా వార్తలు ఎంపి సంతోష్ దాతృత్వం

ఎంపి సంతోష్ దాతృత్వం

MP-Santhosh-Kumar
బాలికల ఇబ్బందిని చూసి చలించిన జోగినపల్లి
పాఠశాలలో మరుగు దొడ్డి నిర్మాణానికి తక్షణమే ఎంపి లాడ్స్ విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మరుగు దొడ్డి సదుపాయం లేక బాలికలు ఇబ్బందిపడుతున్నట్లు ఒక పత్రికలో వచ్చిన వార్తకు ట్విట్టర్‌లో స్పందించారు. తక్షణమే తన ఎంపిలాడ్స్ నిధుల నుండి కావలసిన నిధులను మంజూరు చేస్తున్నానని, సమస్యను త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా ఇబ్బందిపడుతున్న ఆడపిల్లల పాలిట అన్నయ్యలాగా మారాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అడవుల పెంపకం, పరిరక్షణ ధ్యేయంగా మూడు కోట్లకు పైగా మొక్కలను నాటి గ్రీన్ ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో విప్లవాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా కీసర రిజర్వ్ ఫారెస్ట్‌ని దత్తత తీసుకుని ఎకో ఫ్రెండ్ పార్క్ గా కూడా మార్చారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ వాళ్ళకి అండదండగా నిలుస్తూ ఆదర్శప్రాయులు అవుతున్నారని కితాబులందుకుంటున్న ఎంపి మరిన్ని పనులు చేస్తూ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

MP Santhosh kumar Respond In Twitter On Students Problems