Home తాజా వార్తలు సూపర్ హిట్

సూపర్ హిట్

MP Santosh Kumar

 

ఎంపి సంతోష్ జన్మదినోత్సవ పిలుపునకు అనూహ్య స్పందన

పెద్ద ఎత్తున మొక్కలు నాటిన సామాన్యులు, ప్రముఖులు
ఒక్క రోజే లక్ష మొక్కలకు జీవం
స్వచ్ఛందంగా గ్రీన్ చాలెంజ్‌లో భాగస్వామ్యం
దేవనార్ అంధుల స్కూల్లో మొక్కలు నాటిన జోగినపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్కడ చూసినా గ్రీన్‌ఛాలెంజ్ పేరే వినబడుతోంది. ప్రజలు మొక్కలు నాటడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. శనివారం ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్షమొక్కలను నాటారు. సిఎస్ నుంచి కారోబార్ వరకు, మంత్రుల నుంచి కార్యకర్తల వరకు, సామాన్యుల నుంచి సంపన్నులు, కుల, మత, వర్గ, వయో బేధాలు లేకుండా గ్రీన్‌ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. సంతోష్‌కుమార్‌కు వచ్చిన చిన్న ఆలోచన నేడు మహో ద్య మంగా కొనసాగి ఖండాంతరాలను దాటిం ది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది. ప్రముఖులతో పాటు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటడంతో పాటు మరో ముగ్గురికి గ్రీన్‌ఛాలెంజ్‌ను విసిరారు. పలువురు ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.

మొక్కలు నాటిన మంత్రులు..
ఎంపి సంతోష్ పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో మొక్కలు నాటారు.గ్రీన్‌ఇండియా ఛాలెం జ్ ఎంపి సంతోష్ పుట్టినరోజు గిఫ్ట్ అని మంత్రి పువ్వా డ అజయ్ వ్యాఖ్యానించారు. సంతోష్ పుట్టిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎంపి సంతోష్‌కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వీకరించారు. పోచంపాడులోని నెహ్రూపార్కు వద్ద మంత్రి శనివారం మొక్కలు నాటారు. ఎంపి సంతోష్ కుమార్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సంతోష్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారన్నా రు.

మొక్కలు నాటిన ఎంపి సంతోష్‌కుమార్
తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎంపి సంతోష్ కుమార్ బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా అమీర్ పేట గురుద్వారాను ఎంపి సంతోష్‌కుమార్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంతోష్‌కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన చిన్ననాటి స్నేహితులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డితో కలిసి కీసరగుట్ట అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఎంపి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను ఎసిబి డిజి డాక్టర్ పూర్ణచందర్‌రావు స్వీకరించి ఏసిబి ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటారు.

మేడిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషి మొక్కలు నాటారు. గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా ఎపి సిఎస్ నీలం సహానీ, స్పెషల్ సిఎస్ రాజేశ్వర్ తివారీ, పిసిసిఎఫ్ శోభలకు సిఎస్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తనకు గ్రీన్‌ఛాలెంజ్ చేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా మాట్లాడుతూ తాను చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను సిఎస్ స్వీకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంతోష్ పుట్టినరోజు సందర్భంగా మలక్‌పేటలోని పిన్ మూగ , చెవిటి ఆశ్రమ పాఠశాలలో మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేసి మొక్కలు నాటారు. మూగ, చెవిటి ఆశ్రమ పాఠశాలకు రూ.10,000/- ఆర్థిక సాయాన్ని చెక్‌రూపంలో ఆయన అందజేశారు.
మొక్కలు నాటిన ఎంఎల్‌ఎ యాదయ్య, టి న్యూస్ సిజిఎం ఉపేందర్
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని సోలీపేట గ్రామంలో ఎంపి సంతోష్‌కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని టి న్యూస్ సిజిఎం ఉపేందర్‌తో కలిసి యాదయ్య మొక్క లు నాటారు. టి న్యూస్ సిజిఎం ఉపేందర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మె ల్యే దాస్యం వినయ్ భాస్కర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ స్వీకరించడంతో పాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలోని స్మృతి వనంలో మొక్కలు శనివారం మొక్కలు నాటారు.

MP Santosh Birthday Celebrations in Devnar Blind School