Wednesday, April 24, 2024

ఎంపి సంతోష్‌కు వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డు

- Advertisement -
- Advertisement -

MP Santosh Kumar Got Vrikshamitra Samman Samaroh Award

జైపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం

మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దేశ విదేశాల్లో మొక్కలు నాటిన నా వృక్ష ప్రేమికులందరిది.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ’రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో జరుగుతున్న వృక్ష మిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్, ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు అందుకోవాల్సిన సంతోష్‌కుమార్.. అధికారిక కార్యక్రమాలతో అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, మర్ది కరుణాకర్ రెడ్డి అవార్డును స్వీకరించారు. శనివారం జైపూర్‌లోని వ్యవసాయ పరిశోధన కళాశాల ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలిమ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎరిక్ సోలిమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ప్రశంసలు కురిపించారు. ఒక్కడిగా మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో మొక్కలు నాటించే స్థాయికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రేపటి తరానికి నిజమైన బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత నిస్వార్ధంగా ముందుకు తీసుకుపోతున్న జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు నా అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎరిక్ సోలిమ్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు ఆకుపచ్చ కండువాతో సత్కరించారు. ఆయనకు వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. ప్రకృతి పట్ల ప్రేమతో, నిత్యం ప్రకృతి ఆరాధన చేసే లాంబ గ్రామం నుంచి వచ్చిన విష్ణు శ్రీ కల్పతరు సంస్థాన్‌ను స్థాపించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థల్ని, వ్యక్తుల్ని ప్రోత్సహించడం తనను అమితానందం కలిగిచిందని జోగినిపల్లి సంతోష్‌కుమార్ తన సందేశంలో తెలిపారు.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News