Home తాజా వార్తలు ఖైదీల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తా

ఖైదీల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తా

MP Santosh planted saplings along with prisoners

 

సత్ప్రవర్తన కలిగిన వారి విడుదలకు కృషి చేస్తా
జైల్లో నాటిన ప్రతి మొక్కనూ ఖైదీలు సంరక్షించాలి
చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఆరో విడత హరితహారంలో
భాగంగా ఖైదీలతో కలిసి మొక్కలు నాటిన ఎంపి జోగినపల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: జీవిత ఖైదీల సమస్యలను ముఖ్య మంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో శనివారం చర్లపల్లి సెంట్రల్ జైల్లో మంచిప్రవర్తన కలిగిన ఖైదీలతో కలిసి ఎంపి. సంతోష్‌కుమార్ మామిడి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల యో గక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఖైదీలు తమ సమస్యలపై సంతోష్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంలో ఆలస్యం అవుతుందని, ఆగస్టు15, జనవరి 26న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం గతకొద్దికాలంగా అమలు కావడం లేదని ఖైదీలు సంతోష్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ క్షమాభిక్ష అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

జైల్లో ఖైదీలు నాటిన ప్రతి మొక్కను నాటిన ఖైదీ సంరక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ శాసనసభ్యుడు బేతి సుభాష్‌రెడ్డి, ఎంఎల్‌సి కాటేపల్లి జనార్థన్ రెడ్డి, జైళ్ల శాఖ డిజి రాజీవ్ త్రివేది, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ వాసం వెంటేశ్వర్లు, జైళ్ల శాఖ ఐజి సైదయ్య, డిఐజి ఎంఆర్. భాస్కర్, పర్యవేక్షణ అధికారి డాక్టర్ దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MP Santosh planted saplings along with prisoners