Tuesday, April 16, 2024

హద్దులు చెరిగిపోతున్నాయి

- Advertisement -
- Advertisement -

పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాష్ట్రం… దేశం… ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా మారుతున్నది. ఇజాలు, సిద్ధాంతాలు, భేషజాలు విస్మరించి పుడమితల్లిని హరితమయం చేసి మానవాళికి సహజ ఆక్సిజన్ అందించే మహత్తర కార్యక్రమానికి అంతా ‘మేము సైతం’ అని నినదిస్తూ ముందుకు వస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి, కాంగ్రెస్ పార్టీ ఎంపి శశిథరూర్, బిజెపి ఎంపి ఆదేశ్‌గుప్తాలు పార్టీలు ఎవైనా ముందుకొచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటి మరికొందరికి సవాల్ విసిరారు. ఒవైసి హైదరాబాద్‌లో, శశిథరూర్ తిరువనంతపురంలో, ఆదేశ్‌గుప్తాలు ఢిల్లీలో మొక్కలు నాటారు. 

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రాల సరిహద్దులను దాటుకుంటూ, తెలంగాణ గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు విస్తృతంగా కొనసాగుతుంది. మతాలకు, పార్టీలకు అతీతంగా పర్యావరణ పరిరక్షణే లక్షంగా కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం పార్టీల నేతలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ను అభినందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలపునిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఇచ్చిన పిలుపుమేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమం ఎంతో గొప్పదని ఎంఐఎం అధినేత ఎంపి అసదుద్దీన్ ఒవైసి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసి హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు దశల మాదిరిగానే 3వ దశ గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అసదుద్దీన్ చెప్పారు.


పర్యావరణ పరిరక్షణకు నిజమైన సవాల్
టిఆర్‌ఎస్ ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన తిరువనంతపురం ఎంపి శశిథరూర్ ఇటీవల తన నియోజకవర్గంలో మొక్కలు నాటడంతో పాటు తిరిగి ఆదివారం ఢిల్లీలోని తన క్యాంపు కార్యలయంలో మొక్కలు నాటి పలువురికి గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మొక్కలు నాటడంలో అశ్రద్ధ వహించడంతోనే దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ సవాల్‌గా మారిందన్నారు. పర్యావరణానికి విఘాతం కలగడంతోనే ఢిల్లీలో ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పో పరిస్థితి వచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా థరూర్ కర్ణాటక రాజ్యసభ సభ్యుడు జయరామ్ రమేష్, బిజెపి ఎంపి జయంత్ సిన్హా, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి జయ్ పాండా, అమృత్‌సర్ ఎంపి గుర్జిత్ సింగ్ ఔజ్ల, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఎంపి మూవా మొయిత్రాలకు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ చేశారు.
మొక్కలు నాటి పచ్చని భారతావనిని మనమే కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆకుపచ్చని దేశాన్ని సృష్టించుకోవాలని బిజెపి ఢిల్లీ విభాగం అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన ఢిల్లీ బిజెపి కార్యాలయంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైందని ప్రశంసించారు.

MP Shashi tharoor plant sapling at Delhi Camp Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News