Friday, March 29, 2024

వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల ఆందోళన

- Advertisement -
- Advertisement -

MPs protest in front of Gandhi statue in Parliament premises

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీల ఎంపిలు గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో టిఆర్ఎస్ ఎంపిలు పాల్గొన్నారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఎనిమిది మంది ఎంపిలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సస్పెండ్ చేసిన ఎంపిలతో సహా ప్రతిపక్ష పార్టీల ఎంపిలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ బిల్లులు వాపస్ తీసుకోవాలని ఎంపిలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. రైతుల హక్కులు కాలరాసేలా కేంద్ర వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సభ్యుల సస్పెన్షన్ రాజ్యాంగం, రూల్స్ కు వ్యతిరేకమన్నారు. అప్రజాస్వామికంగా సభ్యులను సస్పెండ్ చేశారని కెకె ఫైర్ అయ్యారు. తాము డివిజన్ ఓటింగ్ కోరినా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు.

MPs protest in front of Gandhi statue in Parliament premises

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News