Home జాతీయ వార్తలు ప్రమాణంతో పాటుగా నినాదాలూ…

ప్రమాణంతో పాటుగా నినాదాలూ…

Mps-Oath

న్యూఢిల్లీ: ఎంపిలుగా ప్రమాణం చేసే సభ్యులు ఎలాంటి నినాదాలు చేయకూడదనేది సభా సంప్రదాయం. కానీ సోమవారం ప్రారంభమై న 17వ లోక్‌సభ సమావేశాల రెండో రోజున ప్రమాణం చేసిన సభ్యుల్లో చాలా మంది ప్రమాణం ముగిసిన తర్వాత పలు రకాల నినాదాలు చేయడం కనిపించింది. సభ్యులు ప్రమాణం చేసేటప్పుడు ఎలాంటి నినాదాలు చేయరాదని ప్రొటెం స్పీకర్ హెచ్చరించినప్పటికీ సభ్యులెవ రూ దాన్ని పట్టించుకోలేదు. బిజెపి సభ్యుల్లో చాలామంది తమ ప్రమాణం చివర్లో ‘భారత్‌మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయగా, సంబల్‌నుంచి ఎన్నికయిన సమాజ్‌వాది పార్టీ సభ్యుడు షఫీకుర్ రెహ్మాన్ వందేమాతరం నినాదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయ గా, అధికార పార్టీకి సభ్యులు నిరసన తెలియజేయడమే కాకుండా ఆయన క్షమాపణ చెప్పాల ని కూడా డిమాండ్‌చేశారు.

బిజెపి ఎంపి అరు ణ్ కుమార్ సాగర్ ప్రమాణం చివర్లో రెండుసా ర్లు ‘జైశ్రీరాం’ అంటూ నినాదాలు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేస్తూ ‘వన్‌మోర్ టైమ్’ అనాలని కోరారు. ఆయ న తర్వాత మరో బిజెపి సభ్యుడు అజయ్ కుమార్ ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా రాహుల్ మరోసారి అనాలంటూ ఆయన కు కూడా సూచించారు. అయితే రాహుల్ తన తో పాటుగా జై అంటూ నినాదం చేస్తే తాను మరోసారి ఆదే నినాదం చేస్తానని కుమార్ వ్యాఖ్యానించగా రాహుల్ గాంధీ ‘జైహింద్’ అంటూ నినాదం చేయగా, కాంగ్రెస్ సభ్యులు కూడా ఆయనతో గొంతు కలిపారు. అలీగఢ్ బిజెపి ఎంపి సతీశ్ కుమార్ గౌతమ్ కూడా ఏదో నినాదం చేయగా ప్రొటెం స్పీకర్ అలా చేయరాదంటూ ఆయనకు హితవు చెప్పారు.
హైదరాబాద్ మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయడానికి వస్తున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు జైశ్రీరాం, భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయసాగా రు. ఒవైసీ కూడా దానికి ప్రతిగా తన ప్రమా ణం చివర్లో జై భీమ్, జై మీమ్, తక్బీర్ అల్లాహు అక్బర్, జైహింద్ అంటూనినాదాలు చేశారు. కాగా అంతకు ముందు డిఎంకె సభ్యుడు ఒక రు పెరియార్, కలైంగర్, గాంధీ, అంబేద్కర్‌ను పొగుడుతూ నినాదాలు చేయగా ప్రోటెం స్పీక ర్ జోక్యం చేసుకుని నిర్దేశిత ఫార్మాట్‌లో చేస్తేనే రికార్డుల్లోకి వెళ్తుందని ఆయనకు సూచించా రు. కాగా మథుర బిజెపి ఎంపి హేమామాలిని తన ప్రమాణం చివర్లో ‘రాహే, రాధే’ అనే నినాదంతో పాటుగా, సంస్కృత శ్లోకంలోని కొంత భాగాన్ని ప్రస్తావించారు.

MPs swear in at 17th Lok Sabha