Home తాజా వార్తలు ఎంపిటిసి ఆత్మహత్య

ఎంపిటిసి ఆత్మహత్య

Suicideవనపర్తి‌ : పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఎంపిటిసి మెంబర్ రజిత(20) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లితో గొడవ పడిన రజిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం రజిత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

MPTC Commits Suicide At Gummadam In Wanaparthy