Home తాజా వార్తలు ఎంఆర్ఒ విజయారెడ్డి హత్య కేసు… నిందితుడు మృతి

ఎంఆర్ఒ విజయారెడ్డి హత్య కేసు… నిందితుడు మృతి

MRO Vijaya Reddy Murder Caseహైద‌రాబాద్‌ : అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఒ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించిన సమయంలో సురేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు సురేశ్ ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం చనిపోయాడు. ఘటన జరిగిన రోజునే పోలీసులు సురేశ్ వాంగ్మూలం రికార్డు చేశారు. విజయారెడ్డి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సురేశ్ మృతిని పోలీసులు నిర్థారించాల్సి ఉంది. విజయారెడ్డి ఘటనలో ఆమెతో పాటు ఆమె కారు డ్రైవర్ గురునాథం, నిందితుడు సురేశ్ చనిపోయారు.

MRO Vijaya Reddy Murder Case : Accused Suresh Dead