Home తాజా వార్తలు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం

హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం

MRPS

హైదరాబాద్ : ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పిఎస్ నేతలు, కార్యకర్తలు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో భారతి అనే నాయకురాలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

 MRPS Protest at Hyderabad Collectorate