Home ఆసియా కప్ 2018 సచిన్ తర్వాత ధోనీనే…!

సచిన్ తర్వాత ధోనీనే…!

MS Dhoni becomes second most capped cricketer for India after Sachin
దుబాయి: భారత మాజీ సారథి, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన (అన్ని ఫార్మాట్లలో కలిపి) మూడో ఇండియన్ క్రికెటర్‌గా ధోనీ రికార్డుకెక్కనున్నాడు. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా సూపర్ 4లో ఇవాళ(మంగళవారం) అఫ్గాన్‌తో జరిగే వన్డే మిస్టర్ కూల్  కెరీర్‌లో 509వ మ్యాచ్. ఇక అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా,  మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రావిడ్‌ (509) మ్యాచులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇవాళ్టి మ్యాచ్‌తో ధోనీ.. ద్రావిడ్ సరసన నిలవనున్నాడు. కాగా, ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ద్రావిడ్‌ను అదిగమించి ఎంఎస్ డి  510 మ్యాచ్‌లతో రెండో స్థానానికి ఎగబాకుతాడు. కాగా, అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ తర్వాత మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, సనత్‌ జయసూర్య, రికీ పాంటింగ్‌, షాహిద్‌ అఫ్రిది, కల్లిస్‌, ద్రావిడ్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.