Home తాజా వార్తలు ధోనీ కొత్త లుక్ వైరల్

ధోనీ కొత్త లుక్ వైరల్

Dhoni

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌తో కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ధోనీ ఇటీవల సైనిక విధులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మిస్టర్ కూల్ కొత్త లుక్‌తో జైపూర్ విమానాశ్రయంలో అభిమానులకు దర్శనమిచ్చాడు. ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్లూ మీడియా కంటపడ్డాడు. దీంతో పాటు అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. తలకు నల్లటి బంధన్ కట్టుకొని కనిపించాడు. విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమానులు అతనిని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు వారందర్నీ పక్కకు పంపుతూ ధోనీకి దారిచ్చారు. మునుపెన్నడూ చూడని గెటప్‌తో కనిస్తున్న ధోనీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆర్మీతో కలిసి పని చేయడం కోసం ధోనీ వెస్టిండీస్ టూర్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 15నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ పట్ల అంతటా ఆసక్తి నెలకొంది. రిటైర్మెంట్ గురించి ధోనీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో అతడి ఆఖరి సిరీస్ దక్షిణాఫ్రికాతోనే కావచ్చని అందరూ భావిస్తున్నారు.

MS Dhoni new look Viral in Social Media