Home తాజా వార్తలు ఆ ఆరోపణల్లో నిజం లేదు

ఆ ఆరోపణల్లో నిజం లేదు

MSK Prasad remarks on anushka tea controversy

ఎమ్మెస్కే ప్రసాద్

ముంబై: గతంలో వన్డే ప్రపంచకప్ సందర్భగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మకు భారత సెలెక్టర్లు టీ అందించారని మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టి పారేశాడు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ప్రసాద్ ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించాడు. అప్పట్లో ఫరూక్ ఇంజినీర్ సెలెక్టర్లను అనవసరంగా వివాదంలోకి లాగారని వాపోయాడు. తమను తక్కువ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతో మనోవేదనకు గురి చేశాయన్నాడు. ఇక చీఫ్ సెలెక్టర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని, జట్టు ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చానని ప్రసాద్ స్పష్టం చేశాడు.