Friday, April 19, 2024

14వ సారి అత్యంత సంపన్న భారతీయుడిగా ముఖేశ్ అంబానీ

- Advertisement -
- Advertisement -

 

Ambani and Adani, 4 other indians earned $45 billion
న్యూఢిల్లీ: సంపన్న భారతీయులు-2021 జాబితాను ఫోర్బ్ విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ(64) అగ్రశేణిలో నిలిచారు. ఈ ఏడాది ఆయన మరో 4 బిలియన్ డాలర్లను తన నెట్‌వర్త్‌కు జతచేసుకోవడంతో ఆయన సంపద 92.7 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. విశేషం ఏమిటంటే 2008 నుంచి వరుసగా సంపన్న భారతీయులు జాబితాలో ఆయనే మొదటి స్థానంలో ఉంటున్నారు. ఆయన తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ(59)లో ఉన్నారు. సంపన్న భారతీయుల మొత్తం సంపద విలువ ఇప్పుడు 775 బిలియన్ డాలర్లు.

ఫోర్బ్ మ్యాగజైన్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాను ప్రచురించింది. ఈ ఏడాది ఈ సంపన్నులు తమ సంపదకు మరో 11 బిలియన్ డాలర్లను చేర్చుకున్నారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివనాడార్(76) భారతీయ సంపన్నుల్లో మూడో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 31 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్ మ్యాగజైన్ జాబితా ప్రకారం ఈ ఏడాది టాప్ 20లో నిలిచిన భారతీయులు వీరు:
1. ముకేశ్ అంబానీ(92.7 బిలియన్ డాలర్లు)
2.గౌతమ్ అదానీ (74.8 బిలియన్ డాలర్లు)
3. శివనాడార్ (31 బిలియన్ డాలర్లు)
4. రాధాకిషన్ దమానీ( 29.4 బిలియన్ డాలర్లు)
5. సైరస్ పూనావాలా(19 బిలియన్ డాలర్లు)
6. లక్ష్మీ మిత్తల్ ((18.8 బిలియన్ డాలర్లు)
7. సావిత్రి జిందాల్ (18 బిలియన్ డాలర్లు)
8. ఉదయ్ కొటక్ (16.5 బిలియన్ డాలర్లు)
9. పల్లన్‌జీ మిస్త్రీ (16.4 బిలియన్ డాలర్లు)
10. కుమార్ బిర్లా (15.8 బిలియన్ డాలర్లు)
11. గోద్రేజ్ కుటుంబం(15.2 బిలియన్ డాలర్లు)
12. సునీల్ మిత్తల్ (14.8 బిలియన్ డాలర్లు)
13. బజాజ్ కుటుంబం (14.4 బిలియన్ డాలర్లు)
14. దిలీప్ సంఘ్వీ (14.3 బిలియన్ డాలర్లు)
15. హిందూజ బ్రదర్స్ (14 బిలియన్ డాలర్లు)
16. బర్మన్ కుటుంబం (11.8 బిలియన్ డాలర్లు)
17. మధుకర్ పారేఖ్ (11.7బిలియన్ డాలర్లు)
18. అజీమ్ ప్రేమ్‌జీ(11.2బిలియన్ డాలర్లు)
19. మురళీ దివి (9.9బిలియన్ డాలర్లు)
20. బేణు గోపాల్ బంగూర్(9.5 బిలియన్ డాలర్లు)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News