Saturday, April 20, 2024

మంచి సందేశాన్ని చూపిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం‘. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్‌కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా మీడియాతో హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ “ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి విజయవాడకు చెందిన ఓ చిన్న టౌన్ అమ్మాయి. తను చాలా అమాయకురాలు. సిటీ లైఫ్ ఆమెకు తెలియదు. అలాంటి అమ్మాయి ఒక పేరున్న డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటుంది. ఈ పాత్రలో నేను నటించాను. మరొక క్యారెక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉండే సిటీ అమ్మాయి. ఆమె మాయా ఫెర్నాండేజ్.

ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం”అని అన్నారు. హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్‌లో ఎలా ఉండాలనే విషయంలో అన్నీ తెలిసిన అమ్మాయి ఆమె. నేను చేసిన మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News