Saturday, April 20, 2024

ఘనంగా “ముఖచిత్రం” ప్రీ రిలీజ్ వేడుక

- Advertisement -
- Advertisement -

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. సినిమాకు గంగాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. “ముఖచిత్రం” ఈనెల 9న విడుదలవుతోంది. బుధవారం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, శైలేష్ కొలను, ఆర్జే స్వరూప్ నిర్మాత బన్నీవాస్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Mukhachitram Pre Release Eventఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ… కలర్ ఫొటో చిత్రంతో సందీప్ నేషనల్ అవార్డ్ మనకు తీసుకొచ్చాడు. ఈ సినిమాతో మరోసారి జాతీయ అవార్డ్ సాధిస్తాడు. అంత మంచి కథ ఇది. ఇలాంటి కాన్సెప్ట్ ను చిన్న ఆర్టిస్టులతో గొప్పగా రూపొందించాడు. ప్రియా వడ్లమాని రెండు క్యారెక్టర్స్ లో బాగా నటించింది. ఇలాంటి డైెమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం కష్టం. ఆయేషా, వికాస్ ఇతర నటీనటులు కూడా బాగా నటించారు. చిన్న చిత్రాలకు ఈ మధ్య ప్రాణం పోస్తున్నారు సంగీత దర్శకుడు కాలభైరవ. ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అన్నారు.

నిర్మాత బన్నీవాస్ మాట్లాడుతూ…కరోనా తర్వాత సినిమా లెక్కలు మారిపోయాయి. ఇవాళ కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. కొత్త వాళ్లైనా కథా బలమున్న సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో లాస్ట్ ఇరవై నిమిషాలు అదిరిపోతుంది. విశ్వక్ సేన్ చేసిన పదినిమిషాల క్యారెక్టర్ సినిమాకు ఆకర్షణ అవుతుంది. విశ్వక్ ఆ క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించారు. ప్రతి టెక్నీషియన్ ప్రతిభ చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ చేసిన వర్క్ కు చిన్న కరెక్షన్ కూడా చెప్పలేం అంత బాగుంది. అన్నారు.

దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ…ఇవాళ ప్రేక్షకులను థియేటర్స్ నుంచి బయటకు రప్పించాలంటే సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలి. అలాంటి వైవిధ్యత ఈ సినిమాలో ఉన్నాయి. మా హిట్ 2తో ఇండస్ట్రీకి మరో సక్సెస్ వచ్చింది. ముఖచిత్రంతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

Mukhachitram Pre Release Eventచిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ…నేను సందీప్ కలిసి ఓ స్టోరి మీద వర్క్ చేయడం ప్రారంభించాం. నిర్మాతల దగ్గరకు వెళ్లాం. బడ్జెట్ పెరుగుతుందనేే కారణంతో కొందరు ప్రొడ్యూసర్ బ్యాక్ స్టెప్ వేశారు. అప్పుడు సందీప్ మనమే చేద్దాం సినిమా అనే ధైర్యాన్నిచ్చారు. అలా ఈ సినిమా మొదలైంది. సందీప్ ఎన్నో శ్రమించి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అతనే కాదు ఆయన కుటుంబం కూడా ఆ బాధ్యత తీసుకుంది. వారందిరికీ నా థాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ… మనం తమిళం, మలయాళం సినిమాలను ఓటీటీలో చూసినప్పుడు ఇలాంటి సినిమా మన తెలుగులో ఎందుకు రావడం లేదు అనుకుంటాం. మన ఇండస్ట్రీలో అలా పేరు తెచ్చుకునే సినిమా ముఖచిత్రం అవుతుంది. ఇందులో మన సొసైటీలో అన్ స్పోకెన్ ఇష్యూ ఒకటి చెప్పాం. అదేంటో సినిమాలో చూడండి. సందీప్ నిర్మాతగా తన పూర్తి బాధ్యత నెరవేర్చాడు. ఒక మంచి సినిమాను నిర్మించాడు. మీరు ఆదరిస్తే ఇలాంటి మంచి చిత్రాలెన్నో తెరపైకి వస్తాయి. అన్నారు.

హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ…ప్రతి మహిళ కోసం తీసిన సినిమా ఇది. ఈ కథలో చెప్పిన ఘటనలు ఏ మహిళ జీవితంలోనైనా జరగవచ్చు. మేం చాలా కష్టపడి చేసిన చిత్రమిది. మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాం. పర్మార్మెన్స్ ఓరియెంటెండ్ క్యారెక్టర్స్ ఇచ్చిన సందీప్, గంగాధర్ కు థ్యాంక్స్. అని చెప్పింది. హీరోయిన్ ఆయేషా మాట్లాడుతూ…నేను నా ఫ్యామిలీని వదిలి ఇక్కడికొచ్చి వర్క్ చేస్తున్నా. అయితే ఏ రోజూ నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదు. మా టీమ్ అంతా ఒక ఫ్యామిలీ పనిచేశాం. తొలి చిత్రమైనా నాకు మంచి పేరు తీసుకొస్తుంది. అని చెప్పింది.

నిర్మాత సందీప్ రాజ్ మాట్లాడుతూ…మరో ఈవెంట్ ఉంటుందనే నమ్మకంతోనే ప్రతిసారీ నేను తక్కువగా మాట్లాడుతుంటాను. సక్సెస్ మీట్ లో మీకు ఈ సినిమా గురించి డీటెయిల్డ్ గా చెబుతాను. మేం ఏం చేశాం ఈ సినిమాతో అనేది రేపు సినిమాలోని ఫస్ట్ హాఫ్ మాట్లాడుతుంది, సెకండాఫ్ ఇంకా గట్టిగా చెబుతుంది. ఒక న్యూ అటెంప్ట్ చేశాం. మీకు నచ్చేలా ఉంటుంది. అని అన్నారు.

నిర్మాత ప్రదీప్ యాదవ్ మాట్లాడుతూ…ఈ సినిమాను 16 నెలలు కష్టపడి నిర్మించాం. ఇది మామూలు విషయం కాదు. ఈ జర్నీలో టీమ్ తో పాటు మా సహ నిర్మాతలు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఈ నెల 10న మా నాన్న బర్త్ డే, 9న సినిమా రిలీజ్ అవుతోంది. ఆయనకు సక్సెస్ తోనే బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అన్నారు.

హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ…సినిమా బండి తర్వాత నా నెక్ట్ మూవీ ఎలా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో సందీప్ టీమ్ నాకు కాల్ చేశారు. గంగాధర్ గారు కథ చెప్పినప్పుడు మనం చేయబోతున్నది మామూలు సినిమా కాదు అనిపించింది. సందీప్ నాతో చాలా గొప్ప సినిమా చేశావ్ థ్యాంక్స్. మా నాన్న బతికి ఉంటే ఎంతో గర్వపడేవారు. అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News