Home ఆదిలాబాద్ కెటిఆర్ పుట్టిన రోజు : 2వేల మొక్కలు నాటిన ముఖ్రా కే ప్రజలు

కెటిఆర్ పుట్టిన రోజు : 2వేల మొక్కలు నాటిన ముఖ్రా కే ప్రజలు

Mukhra K People Planted 2Thousand Plantsఆదిలాబాద్ : టిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్రా కే స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వ‌ర్యంలో ఆ గ్రామ‌ ప్రజలు శనివారం రెండు వేల మొక్క‌లు నాటారు. హ‌రిత‌హారంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల మొక్క‌లు నాటిన‌ట్లు సర్పంచ్ మీనాక్షి తెలిపారు. కెటిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సంజీవ్, తిరుప‌తిలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.