Home భద్రాద్రి కొత్తగూడెం భద్రగిరికి ముక్కోటి శోభ

భద్రగిరికి ముక్కోటి శోభ

దక్షిణ భారత అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి ముక్కటి శోభను సంతరించుకుంది. విద్యుత్ కాంతులతో వెలుగులో కళకళలాడుతోంది. భద్రాద్రి వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆదివారం పవిత్ర గోదావరిలో శ్రీసీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య విహారానికి సర్వం సిద్ధమైంది. సోమవారం వైభవోపేతంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించేందుకు సకలం సన్నద్ధమైంది. భక్తుల సౌకర్యార్థం ఆయల సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

భద్రాచలం టౌన్: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జాగ్రత్తగా ఉండాలంటూ దేవస్థానం అధికారులు సూచనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయానికి చేరుకునేందుకు రామాలయం ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ పత్రాలను ప్రచురించి పంపిణీ చేస్తున్నారు.
సూచనలు ఇవే..
* 09వ తేదీ ఉదయం 4 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శన ప్రవేశ క్యూలైన్ లోనికి ప్రవేశము. భక్తులంతా ఉదయం 3.30 గంటల వరకూ వైకుంఠ ద్వారం వద్దకు చేరుకోవాలి.

* 9వ తేదీ తెల్లవారుజామున 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకూ, తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు మూల వరుల ఉచిత దర్శనం, రూ.50 కి ప్రత్యేక దర్శనం క్యూలైన్ ద్వారా ఏర్పాటు.

* సూచించిన గేటు ద్వారా క్యూపద్దతి పాటిస్తూ సెక్టారులోనికి ప్రవేశించాలి.

* స్వామివారి ప్రసాదం చిన్నలడ్డు 1 రూ.15, పెద్ద లడ్టు రూ.40లకు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తారు.

* పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు నిర్ధేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలి. పవిత్ర పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

* గోదావరి లోతు తెలిపే హెచ్చరిక బోర్డులను దాటి లోనికి వెళ్లి స్నానాలు ఆచరించరాదు.

* వేకుంఠ ద్వారం వద్ద ఉన్న స్వామి వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేయరాదు.

* నిర్ణయించిన సెక్టార్లల నుండి మాత్రమే భక్తులు స్వామి దర్శనం చేసుకోవాలి.
* భక్తులుతమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, దోంగలు తిరిగే అవకాశం ఉన్నందున కనిపెట్టుకుని ఉండాలి.
* పిల్లల జేబుల్లో తమ చిరునామాలు తెలిపే కాగితాన్ని రాసి ఉంచాలి. వారి తప్పిపోయిన నప్పుడు సులువుగా తమ వద్దకు చేర్చేందుకు అవకాశం ఉంటుంది.

* భక్తులకు ఎలాంటి సమాచారం కావాలన్నా సమాచార కేంద్రాలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా అందుకోవచ్చు.
* 9వ తేది నాడు ఉ.8 గం. నుంచి ఉత్తర ద్వారం ద్వారా మూల వరుల దర్శనం మనిషికి రూ.100.

* రూ.1000 వివిఐపి, విఐపి, రూ.500 సెక్టారు టిక్కెట్లు పోందిన వారికి ఉత్తర ద్వారం గుండా ఉచిత దర్శనం ఏర్పాటు కలదు.
ఇవిగో సౌకర్యాలు..
ప్రసాదాల కౌంటర్లు: తూర్పుమెట్లు వద్ద ఆరు కౌంటర్లు, పునర్వసు మండపం, రామకోటి స్థూపం, పడమర మెట్ల వద్ద ప్రసాదా కౌంటర్లు
ఏర్పాటు చేశారు.
వాహనాల పార్కింగ్: కల్యాణ మండపం స్టేడియం వద్ద, అయ్యప్ప గుడి వెనుక.

సమాచార కేంద్రాలు: ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద, ఆర్టిసి బస్డాండ్ ఆవరణలో, తానీషా కల్యాణ మండపం వద్ద, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద.

మరుగుదోడ్లు: ఆర్టిసి బస్డాండ్, కల్యాణ మండపం స్టేడియం వెనుక, గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్, బ్రిడ్జీ ప్రవేశ ద్వారం వద్ద. ఉచిత వసతి

సౌకర్యం: విస్తా కాంప్లెక్స్, గోదావరి నది ఓడ్డు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: ఆంజనేయస్వామి విగ్రహం, ఆర్టిసి బస్టాండ్, విస్తా కాంప్లెక్స్, గోదావరి ఘాట్, కల్యాణ మండపం, ఆలయ ప్రాంగణం, బ్రిడ్డి ప్రవేశ ద్వారం వద్ద

తాగునీరు: పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో డ్రమ్ముల ద్వారా మంచినీటిని ఏర్పాటు చేస్తారు.

Bhadradri భద్రాచలం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. దక్షిణ భారత అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ
సీతారామచంద్రస్వామివారి ఆలయం ఆధ్వర్యంలో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతిఏటా నిర్వహించే మాదిరిగానే ఈ ఏడాది కూడా రామాలయం ఆధ్వర్యంలో ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

నేడు తెప్పోత్సవం…

Bhadradri2ముక్కోటి ఏకాదశికి ముందు రోజున స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ సీతా రామచంద్ర స్వామి వారు పవిత్ర గోదావరిలో నదీ విహాహం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లాంచీని తెప్పించి దానికి హంస రూపుచేసి సిద్ధం చేశారు. హంస వాహనంలో శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య నదిలో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు. స్వామివారి హంస వాహనం నదిలో ఐదుసార్లు తిరగనుంది. నదీ విహారంలో స్వామి ఉన్నప్పుడు బాణాసంచా కాల్పులు పెద్ద ఎత్తున చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక హంస వాహనాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

భక్తులు నదీ తీరానికి చేరుకుని స్వామివారిని దర్శించుకునే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు నదీ తీరం వద్ద మంచినీటి సౌకర్యంతోపాటు అత్యవసర సేవలైన వైద్యం, ఫైర్ వంటివాటిని అందుబాటులో ఉంచారు. భక్తులకు చెందిన పిల్లలు తప్పిపోయినప్పుడు సమాచారాన్ని మైకులు ద్వారా తెలిపే విధంగా సమాచార కేంద్రాన్ని సైతం సిద్ధం చేశారు. తెప్పోత్సవం రోజైన ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకూ సేవాకాలం, శ్రీ తిరుమంగై అళ్వారుల పరమ పదోత్సవం జరుగుతుంది. మధ్యామ్నం 1 గంట నుంచి 2 గంటల వరకూ స్వామికి రాజభోగం, శాత్తుమోరై, పూర్ణ శరణాగతి సేవ. పగల్‌పత్తు సమాప్తి, 3 గంటలకు ప్రభు త్వోత్సం (ధర్బారుసేవ)
జరుపుతారు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకూ స్వామివారి ఊరేగిం పుగా మేళ తాళాలు, భాజా భజంత్రీలు, వేదఘోష, కోలాట నృత్యాల నడుమ ప్రత్యేక పల్లికీలో గోదావరి నది వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకూ శ్రీ స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు.

రేపు ఉత్తర ద్వార దర్శనం…

స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం ముగిసిన మరుసటి రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం జరగనుంది. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. భూ లోక వైకుంఠాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ… ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా రామాలయ ప్రాంగణం విద్యుత్ కాంతులను విరజిమ్ముతోంది. రంగురంగుల దీపాలతో రామాలయం గాలిగోపురాన్ని అలంకరించారు.

Bhadradri4ఆలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఎటు చూసిన దీపకాంతులతో శోభాయమానంగా కనిపిస్తోంది. భక్తిభావం ఉట్టిపడేలా చేసిన ఏర్పాట్లు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కరకట్టపై నుంచి చూస్తే రామాలయం ప్రాంగణం భూలోక వైకుంఠంలా ఉంది. ఓ పక్క బాపు బొమ్మలు, మరో ప్రక్క విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన భగవంతుని రూపాలు భక్తుల మనస్సులను దోచుకుంటున్నాయి. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. తెప్పోత్సవం, ముక్కోటి సందర్భంగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లను ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరో పక్క మంచినీరు, మరుగుడొడ్లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చలువ పందిళ్లలో సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య శిబిరాలు, సమాచార కేంద్రం, ప్రసాదాల కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. ముక్కోటి రోజు
భక్తులు ఎల్‌ఇడి టివీల్లో సైతం స్వామివారి ద్వారదర్శనం కార్యక్రమాన్ని తిలకించేలా చర్యలు తీసుకున్నారు.