Home జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా కలెక్టర్ గా సి నారాయణ రెడ్డి

ములుగు జిల్లా కలెక్టర్ గా సి నారాయణ రెడ్డి

 

Mulugu Collector

 

మన తెలంగాణ/ములుగు: ములుగు జిల్లా మొదటి జిల్లా కలెక్టర్ గా సి నారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాలో రాబోయే లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని శాఖల అధికారులను కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ములుగులో పర్యటక ప్రదేశాలు చాలా ఉన్నాయని వాటి అభివృద్ది కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన జిల్లాకు కలెక్టర్ గా రావడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Mulugu Collector is C Narayana Reddy