Home జయశంకర్ భూపాలపల్లి వెంకన్న బాబుకు ఉత్తమ ఆధునిక రైతు అవార్డు

వెంకన్న బాబుకు ఉత్తమ ఆధునిక రైతు అవార్డు

 

ములుగు: జిల్లాలోని వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు నల్లూరి వెంకన్న బాబుకు ఉత్తమ ఆధునిక రైతు అవార్డు దక్కింది. సోమవారం సాయంత్రం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి చేతుల మీదుగా వెంకన్నకు అవార్డు అందజేసి సత్కరించారు. శ్రీ శాంతి కృష్ణ సేవా సంస్థ 34వ వార్షిక వసంతోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు.

 

Mulugu farmer Venkanna babu receive best farmer award