Friday, April 19, 2024

ముంబయి విమానాశ్రయంలో ఆర్‌టి-పిసిఆర్ పరీక్షల విస్తరణ

- Advertisement -
- Advertisement -

Mumbai airport now starts Covid-19 express test

ముంబయి: కరోనా వైరస్‌ను వెంటనే నిర్ధారించే ఆర్‌టి-పిసిఆర్ పరీక్ష సౌకర్యాన్ని ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు కూడా విస్తరించినట్లు ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(సిఎస్‌ఎంఐఎ) శనివారం తెలిపింది. అక్టోబర్ 15 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు గత నెల నుంచి ఇక్కడి విమానాశ్రయంలో ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలను ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికులకు చేస్తుండగా ఇప్పుడు ఈ సౌకర్యాన్ని ఇక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులతోపాటు వారిని సాగనంపడానికి, ఆహ్వానించడానికి వచ్చే సందర్శకులకు కూడా విస్తరించినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. టెర్మినల్ 2లోని లెవల్ 4 వద్ద ఈ టెస్టింట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులు తమ వద్ద గల నెగటివ్ టెస్ట్ రిపోర్టును తమ గమ్యస్థాన విమానాశ్రయంలో చూపించి క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందవచ్చని తెలిపింది.

Mumbai airport now starts Covid-19 express test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News