Wednesday, April 24, 2024

కొత్త జీవితం ప్రారంభించిన ముంబై మొదటి స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్ రోగి

- Advertisement -
- Advertisement -

ముంబై: మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లకు నిలయమైన గ్లోబల్ హాస్పిటల్ ముంబైలో జరిగిన వాటిలో మొదటిదైన స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్ ను కోల్ కతాకు చెందిన 46ఏళ్ల రోగి అనిర్బన్ స మంతాపై చేసింది. డాక్టర్ గౌరవ్ చౌబాల్, ఆయన బృందం ఈ కాంప్లెక్స్ సర్జరీ నిర్వహించింది. స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్ అనేది సంక్లిష్ట, అరుదైన సర్జరీ. భారతదేశంలో ఇప్పటి వరకూ దీన్ని 12-18 సార్లు నిర్వ హించారు. వీటిలో 50 %కు పైగా సర్జరీలు మహారాష్ట్రలోనే జరిగాయి. ముంబైలో మొదటి సర్జరీ ఇదే.

శ్రీ అనిర్బన్ సమంతా 2022 ఏప్రిల్ లో తీవ్రమైన పొత్తికడుపు నొప్పికి గురయ్యారు. అది సుపీరియర్ మె సెంటెరిక్ ఆర్టరీ త్రోంబోసిస్ గు గుర్తించారు. అది బోవెల్ గ్యాంగ్రెన్ కు దారి తీస్తుంది. దీనికి గాను ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. 2022 ఏప్రిల్ 17న ఆయనకు రిసెక్షన్ అనస్టోమోసిస్, జెజునొస్టొమీ చేశారు. నాటి నుంచి ఆయన పారెంటెరల్ న్యూట్రిషన్ పైన ఉన్నారు. 2022 మే లో జెడ్ టిసిసి లో న మోదయ్యారు. 2022 మే 18న ఒక అలర్ట్ వచ్చింది. సిడిసి క్రాస్ మ్యాచ్ గురించి నెగెటివ్ నివేదిక వచ్చిన తరువాత టీమ్ రిట్రైవల్ కు వెళ్లింది.

ఈ సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ లివర్, పాంక్రియాస్, ఇంటెస్టైన్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్, హెచ్ పిబి సర్జరీ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ చౌబాల్ మాట్లాడుతూ, ‘‘బోవెల్ ట్విస్టింగ్, పుట్టుకతో లోపాలు లేదా బోవెల్ కణజాలం లోని ఏదైనా భాగం మృతి చెందినప్పుడు కలిగే బోవల్ వైఫల్యంతో బాధపడే వారికి చికిత్స చేసేందుకు స్మా ల్ బోవెల్ డొనేషన్ ఎంతో ముఖ్యం’’ అని అన్నారు. ‘‘గత నెల మొదట్లో అనిర్బన్ అవయవ మార్పిడి కోసం జోనల్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ (జెడ్ టిసిసి) ముంబై లో నమోదు చేయించుకున్నారు. ఆయన ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించగలిగేది అవయవ మార్పిడి ఒక్కటే. సర్జరీ అనంతరం రోగి పూర్తిగా కో లుకున్నారు. అవసరంలో ఉన్న వారి కోసం అవయవదానం చేయాల్సిందిగా నేను ప్రజలను కోరుతున్నా ను. అది వారికి కొత్త జీవితాలను ప్రసాదిస్తుంది’’ అని అన్నారు. లివింగ్ డోనార్ ఇంటెస్టైన్ ట్రాన్స్ ప్లాంట్, లి వర్ ట్రాన్స్ ప్లాంట్స్, సైమల్టేనియస్ కిడ్నీ పాంక్రియాస్ ట్రాన్స్ ప్లాంట్, సైమల్టేనియస్ లివర్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్, సంక్లిష్ట హెపటోపాంక్రియాటికోబైలైరీ సర్జరీ వంటి సంక్లిష్ట సర్జరీలను ఆయన 600కు పైగానే విజ యవంతంగా చేశారు.

బోవెల్ వైఫల్యంతో టోటల్ పేరెంటెరల్ న్యూట్రిషన్ (టిపిఎన్) నుంచి సమస్యలు ఎదుర్కొనే వారికి స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్ ను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా వ్యక్తులు తమకు అవసరమైన పోషకాలను నరంలోకి ఎక్కించిన డ్రిప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే, వారు తినే ఆహారం నుంచి వచ్చే పోషకాలను వారి బోవెల్ (పేగు) శోషించుకోలేదు. షార్ట్ బోవెల్ సిండ్రోమ్ లేదా నాన్ – ఫంక్షనింగ్ బోవెల్ ఉండడం వల్ల తరచుగా ఇలా జరుగుతుంటుంది. పేగు మార్పిడి అనేది ఎంతో సంక్లిష్టమైంది, అరుదైంది. ఇలాంటి మార్పిళ్లలో ప్రపంచంలో కొద్ది మంది వైద్యులు మాత్రమే స్పెషలైజేషన్ చేశారు. స్మాల్ బోవెల్ అనేది ఒక సంక్లిష్ట అవయవం. ఈ విధమైన మార్పిళ్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గౌరవ్ ఇలాంటి సర్జరీలు చేయడంలో శిక్షణ పొందారు. పశ్చిమ భారతదేశంలో ఎన్నో స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్స్ ఆయన చేవారు. లివింగ్ డోనార్ స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్స్ కూడా వీటిలో ఉన్నాయి. ఇలాంటి అరుదైన, సంక్లిష్ట కేసుల అధ్యయనం భారతదేశంలో మాత్రమే గాకుండా అంతర్జాతీయంగా కూడా నూతన ప్రమాణాలు నెలకొల్పేందుకు మాకు తోడ్పడింది.

ఈ సందర్భంగా శ్రీ అనిర్బన్ సమంతా మాట్లాడుతూ, ‘‘నేను కోల్ కతాలో ఉన్నప్పుడు అక్కడి వైద్యులు అన్ని ఆశలూ వదిలేసుకున్నారు. నేను రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకను అని అనుకున్నారు. ఇలాంటి కేసుల్లో నిపుణులైన డాక్టర్ గౌరవ్ చౌబాల్ గురించి మాకు తెలిసింది. దాంతో ఆయనను కలిసేం దుకు ముంబై వచ్చాం. ఆయనను కలిసిన తరువాత ఈ సర్జరీ ద్వారా నేను బతుకుతాననే ఆశ కలిగిం ది. నా సర్జరీ విజయవంతమైంది. నేను, నా కుటుంబం ఎంతో అదృష్టవంతులం. దేశంలో ఇప్పటి వరకు ఇ లాంటివి ఓ డజను మాత్రమే జరగడాన్ని చూస్తే అవయవమార్పిడి విజయవంతం కావడం ఓ గొప్ప విష యం. బాధలో ఉన్న సమయంలోనూ అవయవ దానం చేసేందుకు ఉదార హృదయంతో ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మా ధన్యవాదాలు’’ అని అన్నారు.

సవాళ్లతో కూడిన సంక్లిష్ట కేసులను తీసుకొని చక్కటి ఫలితాలను అందించినందుకు గాను గ్లోబల్ హాస్పిటల్ (పరెల్) సీఈఓ డాక్టర్ వివేక్ తాలౌలికర్ ఈ సందర్భంగా యావత్ జట్టును ప్రశంసించారు. ‘‘ఇం టెస్టైన్ ట్రాన్స్ ప్లాంట్ అనేది ఈ హాస్పిటల్ కు ఎంతో గర్వకారణం. కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్, పాంక్రియాస్, హ్యాండ్ అండ్ స్మాల్ బోవెల్ వంటి వివిధ అవయవాల మార్పిడికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్ (పరెల్) పేరుగాంచింది. పశ్చిమ భారతదేశంలో అవయవ మార్పిడి సంరక్షణ విషయంలో గ్లోబల్ హాస్పిటల్ (పరెల్) అగ్రగామిగా ఉంది. ఇప్పటికే ఇది లివర్, కిడ్నీ, హార్ట్, హ్యాండ్ సంబంధితాల్లో పేరొందింది. ఇక ఇప్పుడు స్మాల్ బోవెల్ కూడా ఈ జాబితాలో చేరింది. ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ గౌరవ్ చౌబాల్ ను కలిగిఉండడం మా హాస్పిటల్ కు గర్వకారణం. ముంబైలో మొదటి స్మాల్ బోవెల్ ట్రాన్స్ ప్లాంట్ చేసింది ఆయనే. అంతేకాదు, లివింగ్ డోనార్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది కూడా ఆయనే. అంతే గాకుండా సింగపూర్ లో పిడియాట్రిక్ పేషెంట్ కు మొదటి ట్రాన్స్ ప్లాంట్ కూడా చేశారు’’ అని అన్నారు.

Mumbai first Small Bowel Transplant Patient starts New Life

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News