Home జాతీయ వార్తలు 27 నుంచి ముంబయి 24×7

27 నుంచి ముంబయి 24×7

Mumbai 24x7

 

ముంబయి: ఈ నెల 27 నుంచి ముంబయిలో మాల్స్, తినుబండారాల హోటళ్లు రాత్రంతా తెరిచి ఉంచేందుకు అనుమతించాలని మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో ఎంపిక చేసిన నివాసేతర ప్రాంతాల్లోని షాపుల్ని తెరిచి ఉంచుతారు. అయితే, మద్యం అమ్మే పబ్‌లు, బార్లు, మద్యం షాపులకు ఈ మినహాయింపు వర్తింది. బార్లు, పర్మిట్ రూంలను ఇప్పటిమాదిరే అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు మూసేయాల్సి ఉంటుంది.

తన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత టూరిజం మంత్రి ఆదిత్య థాకరే ఆ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘2013లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే ఇప్పుడు దానికి కేబినెట్ ఆమోదం లభించింది. నాకు ఎక్కడ పేరొస్తుందో అని ఆనాటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ’ అని ఆదిత్య చెప్పారు. ‘లండన్‌లో ఇదే పద్ధతి ఉంది. అందువల్ల 5 బిలియన్ పౌండ్ల ఆదాయం వస్తోంది.ఇప్పుడు అదే పద్ధతి ఇక్కడ అమలు చేస్తే రెట్టింపు ఉద్యోగాలు దొరుకుతాయనుకుంటున్నాను. అయితే, రాత్రంతా షాపులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలని చెప్పడం లేదు. అది వాళ్లిష్టం’ అని ఆదిత్య థాకరే చెప్పారు.

Mumbai Gets Freedom To Party 24×7 From January 27