Friday, April 19, 2024

ముంబై ‘పాంచ్’ పటాకా

- Advertisement -
- Advertisement -

Mumbai Indians once again won IPL trophy

ఫైనల్‌లో ఢిల్లీపై రోహిత్‌సేన ఘనవిజయం

సంచలనాలు ఏమీ నమోదు కాలేదు. అంచనాలకు తగినట్టే ముంబై ఇండియన్స్ మరోసారి ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలి ఫైనల్లోనే చాంపియన్‌గా నిలువాలనే ఢిల్లీ క్యాపిటల్స్ కల నెరవేరలేదు. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తుగా ఓడించి తన ఖాతాలో ఐదో ఐదో ఐపిఎల్ ట్రోఫీని జమ చేసుకుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.

రోహిత్ మెరుపులు, రాణించిన ఇషాన్, పంత్, అయ్యర్ శ్రమ వృథా, ఫైనల్లో ఢిల్లీ ఓటమి

దుబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి చాంపియన్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఐదోసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక మొదటిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 18.4 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ముంబైని గెలిపించాడు. అద్భతు బ్యాటింగ్‌ను కనబరిచిన రోహిత్ 51 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 68 పరుగులు చేశాడు. ఈ క్రమంలో డికాక్ (21)తో కలిసి తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. సూర్యకుమార్ (19), ఇషాన్ కిషన్ 33 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు.

ఆరంభంలోనే

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి తొలి బంతికే షాక్ తగిలింది. బౌల్ట్ తన మొదటి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్ పంపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సీనియర్ ఆటగాడు అజింక్య రహానె కూడా నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా బౌల్ట్‌కే దక్కింది. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 15 పరుగులు చేసిన ధావన్‌ను జయంత్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న పంత్, అయ్యర్

ఈ దశలో ఇన్నింగ్స్‌ను మెరుగు పరిచే బాధ్యతను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ముంబై బౌలర్లను సమర్థంగాఎదుర్కొంటూ ముందుకు సాగారు. రిషబ్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. మరోవైపు అయ్యర్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇద్దరు అద్భుత పోరాట పటిమను కనబరచడంతో ఢిల్లీ మళ్లీ కోలుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ 38 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అయ్యర్‌తో కలిసి 96 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ఆరు ఫోర్లు, మరో రెండు సిక్స్‌లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు, నైల్ రెండు వికెట్లు పడగొట్టారు.

స్కోరు బోర్డు:

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మార్కస్ స్టోయినిస్ (సి) డికాక్ (బి) బౌల్ట్ 0, శిఖర్ ధావన్ (బి) జయంత్ యాదవ్ 15, అజింక్య రహానె (సి) డికాక్ (బి) బౌల్ట్ 2, శ్రేయస్ నాటౌట్ 65, రిషబ్ పంత్ (సి) హార్దిక్ (బి) కౌల్టర్ నైల్ 56, హెట్‌మెయిర్ (సి) కౌల్టర్ నైల్ (బి) బౌల్ట్ 5, అక్షర్ పటేల్ (సి) రాయ్ (బి) కౌల్టర్ నైల్ 9, రబడా రనౌట్ 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 20 ఓవర్లలో 156/7.

బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 40303, జస్‌ప్రిత్ బుమ్రా 40280, జయంత్ యాదవ్ 40251, నాథన్ కౌల్టర్‌నైల్ 40292, కృనాల్ పాండ్య 30300, పొలార్డ్ 10130.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) లలిత్ (బి) నోర్జే 68, డికాక్ (సి) రిషబ్ (బి) స్టోయినిస్ 20, సూర్యకుమార్ యాదవ్ రనౌట్ 19, ఇషాన్ కిషన్ నాటౌట్ 33, పొలార్డ్ (బి) రబడా 9, హార్దిక్ (సి) రహానె (బి) నోర్జే 3, కృనాల్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 18.4 ఓవర్లలో 157/5.

బౌలింగ్: రవిచంద్రన్ అశ్విన్ 40280, రబడా 30321, నోర్జే 2.40252, స్టోయినిస్ 20231, అక్షర్ పటేల్ 40160, ప్రవీణ్ దూబే 30290.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News