Home ఛాంపియన్స్ ట్రోఫీ ముంబయి మెరిసింది..

ముంబయి మెరిసింది..

బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలుపు శతకంతో ఆకట్టుకున్న విరాట్
విజయంలో కీలక పాత్ర పోషించిన పోలార్డ్ వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్ బద్రీ

ఐపిఎల్ 10వ సీజన్‌లో ముంబ యి ఇండియన్స్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. కోహ్లిసేనతో రసవత్తరంగా జరిగిన పోరులో ఆదిలోనే నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది ముంబయి. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో మునిగిన ముంబయి ఇండియన్స్‌ను పోలార్డ్ అద్భుత ఇన్నింగ్స్ (70) తో ఆదుకోని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు ఆచితూచి ఆడిన పోలార్డ్, క్రునాల్ పాండ్య భాగస్వామ్యంలో ముంబయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో పోలార్డ్ నిష్క్రమించగా, క్రునాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో గెలుపుకు  ఉన్న ముంబయికి విజయం సులువైంది. 

Polardబెంగళూరు: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా శుక్ర వారం ఇక్కడ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగ ళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ గెలిచింది. ఇం కా 7 బంతులు మిగిలిఉండగానే 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. 143 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన ము ంబయి 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులతో బెంగళూరును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో బెంగళూరుకు రెండు పాయింట్లు దక్కగా, ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మొ త్తం ఆరు పాయింట్లు సాధించింది. ఈ సీజన్‌లో మూడో విజయం సాధించడంతో పాయింట్ల పట్టిక లోనూ అగ్రస్థానంలో నిలిచింది.

ముంబయి ఆటగాడు పోలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. లక్ష ఛేదనలో ఆదిలో ముం బయి జట్టుకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్ బద్రీ తనదైన బౌలింగ్ శైలితో ముంబయి ఆటగాళ్లను ఒఒకరితరువాత ఒకరిని పెవిలియన్‌కు లాగిపారేశాడు. బౌలింగ్ విభాగంలో రాణిం చిన ముంబయి పేలవ ప్రదర్శనతో ఆదిలోనే వరుసుగా నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (3), బట్లర్ (2) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, కెప్టెన్ రోహిత్, మెక్లెనగన్ పరుగులేమీ తీయకుండానే చేతులేత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన నితీశ్ రాణా (11) పరుగులకే పరిమితం కాగా, పోలార్డ్ , క్రునాల్ పాండ్య నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.

వీరద్ద రూ కలిసి ఆరో వికెట్‌కు 40 బంతుల్లో 50 పరు గుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పోలార్డ్ (47 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్స్‌లు) బాది 70 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 17 ఓవర్లలో చాహల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పోలార్డ్ దూకుడుకు బ్రేక్ పడింది. క్రునాల్ పాండ్య (37), హార్థీక్ పాండ్య (9) నాటౌట్‌గా నిలిచారు. దీంతో 18.5 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి ముంబయి జట్టు 145 పరుగులు చేసి విజయాన్ని సాధిం చింది. బెంగళూరు బౌలర్లలో బద్రీ నాలుగు వికెట్లు తీసుకోగా, బిన్ని, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. బెంగళూరు బౌలర్లలో శ్యామూల్ బద్రీ ఒక్కడే నాలుగు వికెట్లు తీసి ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్ నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

విరాట్ విజృంభించినా..

ఐపిఎల్ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విరాట్ కోహ్లి జ ట్టులోకి రావడంతో బెంగళూరు ఆటగాళ్లలో నూతన ఉత్సాహం ఉరక లేసింది. వచ్చిరాగానే విరాట్ విధ్వంసక బ్యాటింగ్‌తో విజృంభించా డు. (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్)లతో విరాట్ 62 పరుగులు సాధించి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన రాయ ల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముంబయికి 143 పరు గుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా కోహ్లిసేన బ్యాటింగ్‌కు దిగింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రీస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లి బెంగళూరుకు మంచి శుభారంభాన్ని అందించారు.

బెంగళూరు 63 పరుగుల వద్ద హార్దీక్ పాండ్య బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి గేల్ (22) పరు గులతో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. గేల్ స్థానంలో విధ్వంసక బ్యా ట్స్‌మన్ ఎబి డెవిలియర్స్ క్రీజులో వచ్చాడు. విరాట్‌కు జోడీగా డెవి లియర్స్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. విరాట్ ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ స్కోరును సాధించే దశగా దూసుకెళ్లాడు. గా యం నుంచి కోలుకున్న అనంతరం ఆడిన తొలి మ్యాచ్ కావడంతో కోహ్లి తొలుత నెమ్మదిగా ఆడినప్పటికీ తరువాత దూకుడును పెంచే శాడు. ఈ క్రమంలో (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్)లతో 62 పరు గులు సాధించిన విరాట్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు.

ఒక దశ లో ముంబయి బౌలర్లు తమ బౌలింగ్ శైలితో కోహ్లి దూకుడుకు బ్రేక్ వేశారు. 110 పరుగుల వద్ద మెక్లెనగన్ బౌలింగ్‌లో బట్లర్ క్యా చ్ ఇచ్చి కోహ్లి రెండో వికెట్‌గా నిష్క్రమించాల్సి వచ్చింది. అనం తరం డివిలియర్స్ ధాటిగా ఆడలేక క్రునాల్ పాండ్య బౌలింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి (19) పరుగులకే మూడో వికెట్‌గా వైదొలిగాడు. ఆ తరువాత వచ్చిన కేదార్ జాదవ్ బెంగళూరును ఆదుకుంటాడనుకుంటే (9) పరుగుల కే చేతులేత్తేశాడు. మిగతా ఆటగాళ్లలో మన్‌దీప్‌సింగ్ పరు గులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నెగీ (13), బిన్ని (6) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో మెక్లె నగన్ రెండు వికెట్లు తీసుకోగా, హార్దీక్ పాండ్య, క్రునాల్ పాం డ్య తలో వికెట్ తీసుకున్నారు.

బద్రీ హ్యాట్రిక్ వికెట్ రికార్డు..

లక్ష ఛేదనలో ఆదిలో ముంబయి జట్టుకు బెంగళూరు బౌల ర్లు చుక్కలు చూపించారు. బెంగళూరు బౌలర్ బద్రీ తనదైన బౌలింగ్ శైలితో ముంబయి ఆటగాళ్లు ముగ్గురిని వరుసగా ఒకరితరు వాత ఒకరిని పెవిలియన్‌కు లాగిపారేశాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (3), ముంబయి స్కోరు 7 పరుగుల వద్ద ఉండగా 2.4 ఓవర్లలో బద్రీ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫామ్‌లో లేని రోహిత్ పేలవ ప్రదర్శనతో అనవసర షాట్ ఆడబోయి వికెట్‌ను చేజార్చుకు న్నాడు. మరో ఆటగాడు నితీశ్ రాణా (11) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో వరుసగా వికెట్ తీయడంతో ఈ సీజన్‌లో బద్రీ తొలి హ్యాట్రిక్ వికెట్ రికార్డును నమోదు చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: 142/5 (20 ఓవర్లలో)
క్రిస్‌గేల్ (సి) పార్థీవ్ పటేల్ (బి) హార్దీక్ పాండ్య ; 22, కెప్టెన్ విరాట్ కోహ్లి (సి) బట్లర్ (బి) మెక్లెనగన్ ; 62, ఎబి డివిలియర్స్ (సి) రోహిత్ శర్మ (బి) క్రునాల్ పాండ్య ; 19, కేదార్ జాదవ్ రనౌట్ (బుమ్రా) ; 9, నెగీ నాటౌట్ ; 13, మన్‌దీప్ సింగ్ (బి) మెక్లెనగన్ ; 0, బిన్నీ నాటౌట్ ; 6. ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: ( 20 ఓవర్లలో 5 వికెట్లు) 142 పరుగులు. వికెట్ల పతనం: 1-63, 2-110, 3-115, 4-127, 5-127. బౌలర్లు : సౌథీ : 2-0-23-0, హర్భజన్ సింగ్ : 4-0-23-0, మెక్లెనగన్ : 4-0-20-2, బుమ్రా : 4-0-39-0, హార్థీక్ పాండ్య : 2-0-9-1, క్రునాల్ పాండ్య : 4-0-21-1.

ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : 145/6 (18.5 ఓవర్లలో)
పార్థీవ్ పటేల్ (సి) గేల్ (బి) బద్రీ ; 3, బట్లర్ (సి) గేల్ (బి) బిన్నీ; 2, కెప్టెన్ రోహిత్ శర్మ (బి) బద్రీ ; 0, మెక్లెనగన్ (సి) మన్‌దీప్ సింగ్ (బి) బద్రీ ; 0, నితీశ్ రాణా (సి) అరవింద్ (బి) బద్రీ ; 11, పోలార్డ్ (సి) డెవిలియర్స్ (బి) చాహల్; 70, క్రునాల్ పాండ్య నాటౌట్; 37, హార్థీక్ పాండ్య నాటౌట్; 9, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: ( 18.5 ఓవర్లలో 6 వికెట్లు) 145 పరుగులు.
వికెట్ల పతనం: 1-7, 2-7, 3-7, 4-7, 5-33, 6-126.
బెంగళూరు బౌలర్లు : బద్రీ : 4-1-9-4, స్టార్ బిన్నీ : 2-0-14-1, అరవింద్ : 4-0-21-0, తైమాల్ మిల్స్ : 3.5-0-36-0, చాహల్ : 3-0-31-0, నెగీ : 2-0-28-0.