Home వార్తలు కేరళ 1.. ముంబయి 1

కేరళ 1.. ముంబయి 1

footముంబయి : ఆంటోనియో(89 నిమిషం) చివరి నిమిషంలో గోల్ నమోదుచేయడంతో ముంబయి ఎఫ్‌సితో జరిగిన మ్యాచ్‌ను కేరళ బ్లాస్టర్స్ 1-1తో డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన్ని తప్పించుకోవడమే ధ్యేయంగా ఆడిన ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. దీంతో 25 నిమిషం వరకు ఏ జట్టుకు ఆధిక్యం దక్కలేదు. అయితే 25వ నిమిషంలో అగ్విలెరా గోల్‌తో ముంబయి ఆధిక్యాన్ని సాధిం చింది. మొదట సింగమ్ సుభాష్ కార్నర్‌ను కేరళ గోల్‌కీపర్ సందీప్ నాడి అడ్డుకోవడంతో బంతి అతన్ని తాకి మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చింది. ఇక అక్కడే కాచుకోని ఉన్న అగ్విలెరా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోల్ చేశాడు. ఇక దక్కిన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ రక్షణాత్మకంగా ఆడడంతో ముంబయి విజయం ఖాయమని అనిపించినా చివరి నిమిషంలో ఆంటోనియో గోల్‌తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.