Tuesday, February 7, 2023

బర్త్ డే పార్టీ లో డ్యాన్స్ చేయలేదని చంపేశాడు…!!

- Advertisement -

Mumbai Young man killed friend in pub for n

ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేయలేదని 24 ఏళ్ల జాదవ్ ను 21 ఏళ్ల శిర్వద్కర్ క్షణికావేశంలో చంపేశాడు. ముంబయి అంధేరీ లోని ఓ బర్త్ డే పార్టీ లో జరిగింది ఈ ఘటన.

ముంబయి కి చెందిన జాదవ్, శిర్వద్కర్ ఫ్రెండ్స్. వీళ్ల కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి ఇద్దరూ వెళ్లారు. మొత్తం ఐదుగురు ప్రెండ్స్ కలిసి బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున పార్టీ చేసుకుంటూ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు వాళ్లు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన వీళ్లలో జాదవ్ డ్యాన్స్ చేయకుండా అలాగే నిలుచున్నాడు. దీంతో డ్యాన్స్ చేయాలని జాదవ్ పై శిర్వద్కర్ వత్తిడి తీసుకొచ్చాడు.

అయినప్పటికీ… జాదవ్ డ్యాన్స్ చేయకపోవడంతో కోపంతో శిర్వద్కర్ పక్కనే ఉన్న బల్ల చెక్కను తీసుకొని జాదవ్ తలపై కొట్టాడు. దీంతో జాదవ్ తలకు తీవ్ర రక్తస్రావమయింది.

వెంటనే జాదవ్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ… తలకు తీవ్ర రక్తస్రావమవడంతో జాదవ్ ప్రాణాలు విడిచాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు శిర్వద్కర్ ను అదుపులోకి తీసుకొని ఐపిసి సెక్షన్ 302 కింద కేసు బుక్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

చూశారుగా… క్షణికావేశం, అతి మద్యం ఒక ప్రాణాన్ని ఎలా బలిగొందో?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles