Friday, April 19, 2024

ఎసిబి వలలో మున్సిపల్ ఎఈ

- Advertisement -
- Advertisement -

Municipal AE

 

ఇల్లెందు: ఓ అధికారి వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా ఇరవైవేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. పైసలిస్తేనే బిల్లులు చేస్తానని పట్టుబడుతూ కాంట్రాక్టర్‌ను సతాయించాడు. చిరాకెత్తిన మున్సిపల్ కాంట్రాక్టర్ మడత సురేష్ గౌడ్ ఎసిబికి సమాచారం ఇచ్చాడు. ఎంచక్కా లంచం తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేసి ఏఈ ని పట్టుకున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ టెక్నికల్ ఇంచార్జీ అధికారి ఏఈ ఎం. బాబు నిర్వాహకం ఇది. అందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే…

టెక్నికల్ ఇంచార్జీ అధికారి ఏఈగా ఇల్లెందు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో పైపు లైన్ వేసేందుకు 15 లక్షల వరకు మంజూరైందని తెలిపారు. ఈ బిల్లు చేయకుండా నెలల తరబడి ఏఈ తిప్పుకోని రూ. 30 వేలు డిమాండ్ చేశారని అన్నారు. ఏఈకి కాంట్రాక్టర్ సురేష్ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడని డీఎప్పీ మధుసూదన్ వెల్లడించారు. సురేష్ ఫిర్యాదుతో తాము రంగంలోకి దిగి శుక్రవారం ఓ ఇంట్లో రూ. 20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. తదుపరి విచారణ అనంతరం వివరాలను వెల్లడిస్తామని అన్నారు.

ఇదిలావుండగా ఇల్లెందు మున్సిపాలిటీలో ఇది మూడో ఎసిబి రైడ్‌గా చెప్పవచ్చు. 2008లో అప్పటి సీనియర్ అసిస్టెంట్ మనోహర్ ఇంటి పన్ను విషయంలో ఓ వ్యక్తి నుండి పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. రెండో సారి డెబ్బైఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఎఈ అనిల్ ఎసిబికి చిక్కాడు. ఇప్పుడు ఇంచార్జీ ఎఈ బాబు కాంట్రాక్టర్ మడత సురేష్ గౌడ్ వద్ద ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడటం గమనార్హం. అనంతరం వరంగల్ ఎసిబి డీఎస్పీ మధుసుధన్ మాట్లాడుతూ.. ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064కు తప్పక సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

అవినీతికి ఆస్కారం లేదని, హక్కులు హరించే విదంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న వర్క్‌లకు సంబంధించి పూర్తిగా విచారణ జరుపుతామని తెలిపారు. అక్రమాలు చోటు చేసుకుంటే తరువాత వెల్లడిస్తామన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను ఉపేక్షించేది లేదని, లంచం తీసుకున్నట్లు రుజువైతే మిగతా అధికారులను సైతం విచారిస్తామన్నారు. ఈ తనిఖీలో డీఎస్పీతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Municipal AE in the ACB trap
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News