Friday, March 29, 2024

నిర్మాణరంగంలో మార్గదర్శకాలను విడుదల చేసిన మున్సిపల్ శాఖ

- Advertisement -
- Advertisement -

Construction

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్19 మహమ్మారి కట్టడి కోసం భవన నిర్మాణ స్థలాలు, లేబర్ క్యాంపుల్లో అనుసరించాల్సిన పద్దతులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ శనివారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం సూచించిన నియమావళిని ప్రతి నిర్మాణ స్థలాల్లో విధిగా ప్రదర్శించాలని పేర్కొన్నది. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను కార్మికులకు తెలిపేందుకు రోజూ ఉదయం సమావేశం ఏర్పాటు చేయాలి . ఆరోగ్య రక్షణ నియమావళిపై అందరికీ అవగాహన కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మార్గదర్శకాలలో ముఖ్యమైనవి
* ప్రతి సైట్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ స్థలం లోనికి వచ్చేవారి విధిగా టెంపరేచర్ చెక్ చేయాలి. సైట్ లోనికి, బయటకి వెళ్ళేదారిలో అవసరం ఉన్న వివిధ అంతస్తులో చేతులు శుభ్రప్రచుకునేందుకు వీలుగా నీళ్లు, సబ్బు, శానిటైజర్లను విధిగా అందుబాటులో ఉంచాలి.
*సైట్లలోకి ప్రవేశించే ముందు, బయటకు వెళ్లిపోయేప్పుడు పనివాళ్ళు, ఇంజినీర్లు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. నిర్మాణకూలీలతో సహా అందరూ మాస్క్ లు విధిగా ధరించాలి. బయటనుంచి వచ్చే సామగ్రి తరలించే కూలీలు చేతులకు గ్లౌజ్ లు తప్పక ధరించాలి.

*సైట్లలో గుట్కా, పాన్, తంబాకు నమలడం నిషేధం. కామన్ ఏరియాలో ఉమ్మివేయడం చేయరాదు.
*నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ భోజనాలు చేయాలి. గతంలో ఉన్న కామన్ ఏరియాను తొలగించాలి.నిర్మాణ స్థలంలో ప్రతిరోజూ క్రిమిసంహారక మందులు చల్లాలి.

* అవసరం లేని హెడ్ ఆఫీస్ సిబ్బంది, ఇతర కన్సల్టెంట్ లను ఎట్టి పరిస్థితుల్లో సైట్లలోకి అనుమతించకూడదు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులు, కోవిడ్ 19 పేషేంట్లకు చికిత్స అందించే క్లినిక్ ల జాబితాను సైట్లో డిస్ప్లే చేయాలి. వైద్య సేవలు అందించడానికి కనీసం వారానికి ఒక రోజైనా నిర్ణీత సమయంలో ఒక వైద్యుడు సైట్ ను సందర్శించేలా చర్యలు తీసుకోవాలి.
* సురక్షిత పద్ధతులను స్థానిక భాషలో తప్పులు లేకుండా, సరైన చిహ్నాలతో సూచిస్తూ సైట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి. ఏదైనా గందరగోళం తలెత్తితే, అనుమానం వస్తే, వెంటనే ప్రాజెక్టు మేనేజర్ ను సంప్రదించాలి. పుకార్లు నమ్మొద్దు. వాటిని ప్రచారం చెయ్యొద్దు. అలా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు. లాక్ డౌన్ తరవాత కూలీలను పనిలో చేర్చుకునే ముందే వాళ్ళకు ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి.

*సైట్లో నివసిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కూలీలందరికీ ఫోటో ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. వాళ్ళ వివరాలు నమోదు చేసి, రికార్డు మైంటైన్ చేయాలి. నిర్మాణ కూలీలు సైట్ నుంచి బయటకు వెళ్లారాదు. వాళ్లకు అత్యవసర సరుకుల సరఫరా చేయాలి. ఎమర్జెన్సీ ఐతే సైట్ సూపర్వైజర్ అనుమతితో మాస్క్ ధరించి బయటకు వెళ్ళాలి.
*సరైన ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా బయట కూలీలను సైట్లలో ఉండటానికి అనుమతివ్వరాదు. పనివేళలను షిఫ్ట్ లుగా బదలాయించాలి. ఎక్కువ మంది ఒకేచోట గుమికుడి పని చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సూపర్వైజర్లు సెక్యూరిటీ గార్డులను నియమించాలి.

 

Municipal Department issued Guidelines on Construction
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News