Home తాజా వార్తలు 25లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌లకు త్వరలో మోక్షం

25లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌లకు త్వరలో మోక్షం

Municipal dept has released a checklist on 25 lakh LRS

 

లే అవుట్లు, ప్లాట్లు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశం
రెండు దశల్లో పూర్తి చేయనున్న అధికారులు, చెక్ లిస్టు విడుదల చేసిన పురపాలక శాఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పక్షం రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని అనంతరం తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది. అనుమతులు లేని లే ఔట్లకు సంబంధించిన ప్లాట్ల క్రమబద్దీకరణ నిమిత్తం వచ్చిన దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

2020లో ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా దరఖాస్తుల క్లస్టరింగ్ (గ్రూపులుగా విభజించడం), సైట్ ఇన్‌స్పెక్షన్ (స్థలాన్ని తనిఖీ చేయడం) రెండు ప్రక్రియలను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో వచ్చిన దరఖాస్తులను వివిధ కారణాల రీత్యా పరిశీలన జరపలేదు. దీంతో నిర్దేశిత గడువులోగా దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు దశల్లో పరిశీలన చేయాలన్న ప్రభుత్వం మొదటి దశలో దరఖాస్తులను గ్రామాలు, వార్డులు, సర్వే నంబర్లు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించాలని తెలిపింది.

రెండో దశలో అధికారుల బృందం క్లస్టర్లను
రెండో దశలో అధికారుల బృందం క్లస్టర్లను తనిఖీ చేసి రిమార్కులను ఆన్‌లైన్ నమోదు చేయాలి. దీనికోసం రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో జిల్లా కలెక్టర్లు అధికారుల బృందాలను నియమించాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సంబంధిత మున్సిపల్ కమిషనర్ లేదా కలెక్టర్లకు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పక్షం రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

చెక్ లిస్ట్ విడుదల చేసిన పురపాలక శాఖ
దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్ లిస్ట్ రూపొందించి విడుదల చేసింది. లే ఔట్, ప్లాట్ తనిఖీకి వెళ్లినప్పుడు అధికారుల బృందం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సైట్ ఇన్‌స్పెక్షన్ ముగిసిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలను విరుద్ధంగా ఉన్నా క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించనుంది. కరమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ మళ్లీ కొత్త మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది. అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన అదనపు సమాచారాన్ని సంబంధిత శాఖల నుంచి కావాల్సిన ఎన్‌ఓసిలు సమర్పించడానికి దరఖాస్తుదారులకు నెలరోజుల గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అన్ని రకాలుగా అర్హత కలిగిన దరఖాస్తుల విషయంలో చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులను దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ ద్వారా నోటిఫై చేయడంతో పాటు చెల్లింపునకు తగినంత సమయం కూడా ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Municipal dept has released a checklist on 25 lakh LRS