Home ఖమ్మం మినీ పుర పోరు… ఓట్ల లెక్కింపు ప్రారంభం…

మినీ పుర పోరు… ఓట్ల లెక్కింపు ప్రారంభం…

హైదరాబాద్: తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలను మూడు బ్లాకులుగా విభజించి లెక్కిస్తున్నారు. ఖమ్మ నగర పాలక సంస్థలో 60 డివిజన్లలో 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ప్రతి డివిజన్ కు ఒక కౌంటింగ్ అధికారిని నియమించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల్లోనూ కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్‌ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి.. పోలింగ్‌ కేంద్రాల వారిగా.. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లు లెక్కిస్తారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.