Home తాజా వార్తలు పుర ప్రక్రియ షురూ

పుర ప్రక్రియ షురూ

Municipal election

 

ఈ నెల 17వరకు 121 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన
ఖరారైన వార్డులపై 17న తుది ప్రకటన, జిఒ 795ద్వారా షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : రాష్ట్రంలోని 121 పురపాలక సంఘాలు, 10 పురపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజనకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పురపాలక విభాగం విడుదలచేసింది. ఈ నెల 3 నుంచి 17 వర కు వార్డుల పునర్విభజన ప్రక్రియ జరుగనున్నది. షెడ్యూల్ ప్రకారంగా మునిసిపల్ కమిషనర్ లు పర్యవేక్షణ నిర్వహించి వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సాధారణ ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు, సలహాలను క్రమపద్దతిలో పరిశీలించడంతో పాటు దరఖాస్తుదారులకు వారి అభిప్రాయాలు, సలహాలపై విచారణ విషయమై మాట్లాడే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అభిప్రాయాలను, సలహాలను స్వీకరించడం లేదా తిరస్కరించడంపై వారికి సవివరంగా కారణాలు తెలియజేయాలని మునిసిపల్ కమిషనర్‌లకు ప్రభుత్వం ఆదేశించింది.

విడుదలైన షెడ్యూల్ తేదీల ప్రకారంగా వార్డుల పునర్విభజనకు సంబంధించిన నివేదికలను మొత్తం 131 మంది కమిషనర్‌లు పురపాలక విభాగం డైరెక్టర్‌కు అందజేయాల్సి ఉన్నది. వార్డుల మ్యాప్‌లను తయారు చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా వార్డులకు కేటాయించే క్రమసంఖ్యను ఉత్తరం, తూ ర్పు, దక్షిణం, పశ్చిమం గడియారం తరహాలో కే టాయించాలని ప్రభుత్వం స్పష్టంచేసిం ది. జిఓ 78 లోని 4,5వ నియమం తెలిపినట్టుగా ఒక వార్డుకు మరో వార్డుకు మధ్య ఓటర్ల సంఖ్య తేడాలు 10 శాతానికి ఎక్కువగా కాకుండా ఉం డేలా చూడాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. వార్డుల పునర్విభజన ప్రతిపాదనకు సం బంధించిన అభిప్రాయాలు, సలహాలు సేకరించేందుకు వీలుగా ముసాయిదా ప్రచురణను పురపాలక సంఘం కార్యాలయం నోటీసు బోర్డుపై, ఇతర కార్యాలయాల్లోనూ ఈ నెల 3న అందుబాటులోకి తీసుకువస్తారు. 4వ తేదీన ముసాయిదా ప్రకటనను పత్రికల్లో ప్రచురిస్తారు.

సాధారణ ప్రజానీకం నుంచి అభిప్రాయాలను, సలహాలను ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు 7 రోజులపాటు స్వీకరిస్తారు. ప్రజాప్రతినిధుల, సాధారణ ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను, సలహాలను విచారణచేసి 7 రోజుల్లో అంటే ఈ నెల 16వ తేదీ వరకు పరిష్కరిస్తారు. 16వ తేదీన ప్రత్యేకాధికారి నుంచి పునర్విభజన అభిప్రాయాలను పొందవచ్చును. జిఓ 78లోని 8 నియమం తెలిపిన ప్రకారంగా ఈ నెల 17న నివేదికలను పురపాలక విభాగం డైరెక్టర్‌కు సమర్పించాలి. పురపాలక సంఘం వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుది ప్రకటన ఈ నెల 17న ప్రభుత్వం విడుదల చేస్తుంది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు
జిఓ 459 (తేదీ29.06.2019) ప్రకారంగా రాష్ట్రంలోని 121 మునిసిపాలిటీలు, 10 పురపాలక సంస్థల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం తుది ప్రకటనను 07.07.2019 రోజున విడుదల చేసింది. ఈ వార్డుల విభజన ప్రక్రియపై రాష్ట్ర హైకోర్డులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటి విచారణ అనంతరం వార్డుల విభజన ప్రక్రియలోని ఫిర్యాదుల మేరకు 29.06.2019న ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 78లోని 4,5 నియమాల ప్రకారంగా వార్డుల విభజనలోని పొరపాట్లను గుర్తించి సరిదిద్దాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర పురపాలక పరిపాలనా వ్యవహారాల డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు పురపాలక విభాగం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Municipal election process start