Home యాదాద్రి భువనగిరి రసవత్తరం.. భువనగిరి రాజకీయం

రసవత్తరం.. భువనగిరి రాజకీయం

Political War In Yadadri District

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధిః రాష్టవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలు తమ పదవీకాలాన్ని ఈనెల 3వ తేదీన నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో యా దాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ రాజకీయం రసకందాయంలో పడింది. మున్సిపల్ చట్టం ప్రకారం ఐదేళ్ళ పదవీకాలంలో నాలుగేళ్ళు పూర్తి చేసుకు న్న తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే నిబందనలు ఉన్నాయి. దీంతో 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాల్లో దాదాపు లుకలుకలు ఉన్నప్పటికీ స్థానిక రాజకీయాల నేపధ్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి అవిశ్వా సం తీర్మానం పెట్టిన మున్సిపాలిటీగా యాదాధ్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం నిలిచింది. భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్విలావణ్య శ్రీనివాస్ పదవీబాద్యతలు చేపట్టే రోజున చేసుకున్న రెండున్నరేళ్ళలో పదవి వీడే ఒప్పందం విఫలం చెందడం, ఆమె పట్ల అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్‌లకు ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలు, వర్గపోరాటాల నేపధ్యంలో చాలా కాలంగా కొనసాగుతున్న అవిశ్వాసం పెడుతారన్న ఊహాగానాలకు 4 న తెరపడింది. నాలుగేళ్ళ పదవీకాలం ముగిసిన మరునాడే ఏకంగా పాలకవర్గంలోని 23మంది కౌన్సిలర్‌లు అవిశ్వాస తీర్మానంపై నిర్ణీత ఫార్మాట్‌లో సంతకాలు చేసి యాదాధ్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌కు నోటీసు అందజేశా రు. అవిశ్వాస తీర్మానంకు అనుకూలంగా సంతకా లు చేసిన వారిలో టిఆర్‌ఎస్‌కు 14మంది, కాంగ్రెస్ 4,బీ జేపి3, టీడీపి, సీపిఐఎంలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నా రు. తొలి అవిశ్వాస మున్సిపాలిటీగా రాష్ట్ర వ్యాప్త దృష్టి ని ఆకర్షించిన నేపధ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయా వర్గాల్లో విస్ర్తుత చర్చనీయాంశంగా మారింది.
చైర్‌పర్సన్ లావణ్య పదవీ కాలం నేపధ్యంః 2014 ఎన్నికల్లో సుర్విలావణ్య శ్రీనివాస్ భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానంలో కొలువుదీరగా ఆ తర్వాత జరిగిన రకరకాల రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ తీర్దంపుచ్చుకున్నారు. ఆమెతో పాటు రెండున్నరేళ్ళ పద వీ కాలం ముగిసిన వెంటనే ఒప్పందం మేరకు పద వీ వీడాల్సి ఉండగా మెజార్టీ సభ్యులు అధికారపార్టీలో కొనసాగుతుండడంతో సాఫీగా కొనసాగుతున్నారు. ఈమెతో ఉన్న వ్యక్తిగత విభేదాలు కౌన్సిల్‌లో సర్వత్రా వ్యాపించడంతో అవిశ్వాసరం తీర్మానం ప్రవేశపెట్టాలని సమయం కోసం ఎంతో కాలం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చైర్మన్ లావణ్య విధిలేని పరిస్థితుల్లో సొంతగూటి(బిజెపి)కి చేరుకుంది. దీంతో కౌన్సిలర్‌లలో ఉన్న అసమ్మతిని అవకాశంగా తీసుకొని అధికారి పార్టీ పరంగా లావణ్యను గద్దె దించేందుకు పావులు కది పారు. అప్పటికే గుంబనంగా ఉన్న అసమ్మతి తారాస్థాయికి చేరుకోవడం మూలంగా స్థానిక ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఇతర పార్టీల కౌన్సిలర్‌లను ఆకర్షించేందుకు ప్రణాళిక సిద్దం చేసి సఫలీకృతుడయ్యాడు కూడా. నాలుగేళ్ళ నిబందన సమయం కూడా కలిసిరావడంతో అవిశ్వాసానికి తెరతీశారు. బలసమీకరణ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించి ఎమ్మెల్యే చివరకు ఇద్దరు ఇండిపెండెంట్లను, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను పార్టీలో చేర్చుకోగా, టిడిపి, సీపిఐఎం పార్టీలకు సంబందించిన ఒక్కొక్కరి మద్దతున కూడా కూడగట్టారు. అవిశ్వాసం నెగ్గేందుకు ఎమ్మెల్యే పూర్తిస్థాయి మద్దతు కూడగట్టిన నేపద్యంలో ఇక భువనగిరి అవిశ్వాసం తుదిఘట్టానికి చేరిందని చెప్పవచ్చు. 30మంది కౌన్సిలర్‌లో కూడా భువనగిరి మున్సిపాలిటీలో ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 32మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం అవిశ్వాసానికి టిఆర్‌ఎస్ 18మంది, టిడిపి, సిపిఐఎంలలో ఒక్కొక్కరు, ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 22మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని అధికార పార్టీ కైవసం చేసుకోవడం నల్లేరుమీదనడకే అని పరిశీలకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు పరాభావంః అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన 4కాంగ్రెస్ సభ్యుల్లో ఇద్దరు శనివారం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌కి తీవ్ర పరాభావం జరిగిందన్న వాదన వినిపించింది. అవిశ్వాసంపై ఎలాంటి వ్యూహం అనుసరించాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మం తనాలు జరిపిన వారిలో ఇద్దరు కౌన్సిలర్ టిఆర్‌ఎస్‌లో చేరడం చర్చకు దారితీసింది. అవిశ్వాసం సం ద ర్బంగా అనుసరించాల్సిన విధానంపై రాజగోపాల్‌రెడ్డి నచ్చజెప్పినా వినకుండా అధికార పార్టీలో చేరడంలో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
విస్తృత చర్చనీయాంశంగా భువనగిరి అవిశ్వాసంః రాష్ట్రంలోనే మొట్టమొదటగా భువనగిరి మున్సిపాలిటీ అ విశ్వాసం తెరమీదకు రావడంతో విస్త్రుత చర్చనీయా ంశంగా తయారైంది. భువనగిరి అవిశ్వాసానికి సంబందించి రోజురోజుకు చోటుచేసుకుంటున్న పరిణామా లు, ఎప్పటికప్పుడు కౌన్సిలర్ సంఖ్యా బలాబలాల మా ర్పు ఆయా పక్షాల్లో, ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. చైర్‌పర్సన్ అవిశ్వాసం నెగ్గేనా, వీగేనా అనే చర్చ ప్రతి రం గంలో జరుగుతుండడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భువనగిరి మున్సిపల్ రాజకీయ పరిణామాలు రాష్ట్ర స్థాయి పరిశీలనలో అధికార పక్షానికి అనుకూలం గా ఉన్నా అన్ని వర్గాల్లో మాత్రం ఒకింత ఉత్కంఠ నెలకొని ఉంది.
మున్సిపాలిటీలో పార్టీల బలాబలాలు
పార్టీలు 2014 ప్రస్తుతం
టిఆర్‌ఎస్ 00 18
కాంగ్రెస్ 08 02
టిడిపి 07 01
బీజెపి 08 08
సీపిఐఎం 01 01
ఇండిపెండెంట్ 06 00