Home తాజా వార్తలు కరోనాతో మునుగోడు తహసీల్దార్ కన్నుమూత

కరోనాతో మునుగోడు తహసీల్దార్ కన్నుమూత

Munugodu MRO sunanda passes away

 

మునగోడు: కరోనా వైరస్ సోకడంతో నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ సునంద(58) చనిపోయారు. వారం రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో ఐసియులో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతి పట్ల మనుగోడు ఎంఎల్‌ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఫేస్‌బుక్‌ పేజీలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.