- Advertisement -
హైదరాబాద్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాడు మురళీ విజయ్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో టెస్టుల్లో తన 9వ సెంచరీని సాధించాడు. పుజారా (83)తో కలిసి విజయ్ రెండో వికెట్‌కు 178 పరుగుల స్కోర్‌ను జోడించాడు. కాగా తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విజయ్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 70 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం క్రీజ్ లో రహానే(13) , కోహ్లీ(65) ఉన్నారు.
భారత్ స్కోర్ : 277/3
ఓవర్లు : 78
- Advertisement -