Home తాజా వార్తలు కూతురిని గొడ్డలితో నరికి….

కూతురిని గొడ్డలితో నరికి….

Murder
నాగర్‌కర్నూల్: పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్‌లో మతిస్థిమితం లేని కూతురిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎర్రన్న అనే వ్యక్తి తన కూతురు శ్యామలకు గత సంవత్సరం పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తరువాత ఆమె మతి స్థిమితం కోల్పోవడంతో భర్త వదిలిపెట్టాడు. దీంతో శ్యామల తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కూతురిని గొడ్డలితో నరికి చంపేశాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 

Murder Daughter with Axe by Father in Nagar Kurnool