Home తాజా వార్తలు ఆ ప్రేమికులది ఆత్మహత్య కాదు

ఆ ప్రేమికులది ఆత్మహత్య కాదు

హత్యేనని తేల్చిన పోలీసులు
తల్లి, చెల్లి, బావ సూత్రధారులు
మేనబావ పాత్రధారి
నలుగురి అరెస్ట్

Lovers

 

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/కొత్తగూడెం : భద్రాది కొత్తగూడెం జిల్లా రామాంజనేయ కాలనీలో గత నెల 18న తమ ఇంటిలో అనుమానాస్పదంగా కాలిబూడిదైన మాచర్ల వినోద్, అతని సహచరి తేజస్వినిది ఆత్మహత్యకాదని, పథకం ప్రకారం కుటుంబసభ్యులే వారిని కాల్చిబూడిద చేశారని తమ పరిశోధనలో పోలీసులు తేల్చారు. కాల్‌డేటా ఇతర వివరాల ఆధారంగా కేసును పోలీసులు చేధించారు. ఈ మేరకు వినోద్ తల్లి రాణి, చెల్లితో ప్రియాంకతో సహా మరో ఇద్దరు బంధువులను పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం డిఎస్పీ ఎస్‌ఎం ఆలి విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మార్చి 17 తేదీ రాత్రి వినోద్ తన సహచరి తేజస్వినితో గొడవపడి విపరీతంగా కొట్టడంతో తేజస్విని తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటే వినోద్ రాజశేఖర్ అనే స్నేహితుడి ద్వారా పెయిన్‌కిల్లర్ తెప్పించి ఇచ్చాడు. పథకం ప్రకారం వినోద్ మేనబావ గోపాలకృష్ణ అలియాస్ కిట్టు వినోద్‌కు అదేరోజు రాత్రి బాగా మద్యం తాగించాడు.

రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో వినోద్, తేజస్వీనిలిద్దరూ కిచెన్‌లో నిద్రపోగా, పక్కరూంలో గోపాలకృష్ణ నిద్రపోయాడు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చెట్లపొదల్లో దాచిన పెట్రోల్ తెచ్చి బిందెలో పోసి, గాఢ నిద్రలో ఉన్న వినోద్, తేజస్వినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తలుపులు దగ్గరికి లాగి వెళ్లిపోయాడు. నిప్పు అంటించే క్రమంలో గోపాలకృష్ణ ఎడమచేతి, మెడ ఎడమ బాగానికి సెగ తగిలి కాలి గాయాలు అయ్యాయి. ఈ విషయం వినోద్ మేనబావ గోపాకృష్ణ బావ గోపికి చెప్పి అతని వద్ద రూ.1000, చెల్లి ప్రియాంక వద్దకు వెళ్లి చెప్పి ఆమె వద్దరూ రూ.500 తీసుకుని, లక్ష్మీదేవిపల్లిలోని ఒక ఆర్‌ఎంపి వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుని పారిపోయాడు. ఈ మేరకు కూపి లాగిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. నలుగురు నిందితులు, హత్యకు సూత్రధారులైన వినోద్ తల్లి రాణి, చెల్లి ప్రియాంక, బావ గోపి, హంతకుడు మేనబావ గోపాలకృష్ణలను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకర్ల సమావేశంలో డిఎస్పి ఆలీతో పాటు సిఐ కరుణాకర్, ఎస్‌ఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Murder to Lovers in Police Investigation in Bhadradri