Home జాతీయ వార్తలు ఒకే ఇంట్లో నలుగురిని కత్తులతో పొడిచి…. హత్య

ఒకే ఇంట్లో నలుగురిని కత్తులతో పొడిచి…. హత్య

 

ఛండీగఢ్: ఒక ఇంట్లో నలుగురిని చంపిన సంఘటన హర్యానాలో ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ వైద్యుడి కుటుంబంలో నలుగురిని ఓ జిమ్ ట్రైనర్ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రవీణ్ మెడిరట్ట అనే వైద్యుడు సెక్టార్ 7ఎలో ఎక్స్-రే డయాగ్నిస్టిక్స్ నడిపిస్తూ అదే బిల్డింగ్ లో నివసిస్తున్నాడు. నవంబర్ 9న ప్రవీణ్(65), అతడి భార్య సుదేష్ (61), కూతురు డాక్టర్ ప్రియాంక (30), అల్లుడు సౌరభ్(36) ఆయన ఇంట్లో హత్య చేయబడి ఉన్నారు. ఒక్కొక్కరు వేరు వేరు గదిలో రక్తపు మడుగులో ఉన్నారు. ప్రవీణ్ కుమారుడు దర్పన్ తనకు రాత్రి షిప్టు జాబ్‌కు వెళ్తునని అదే రాత్రి ఆ కుటుంబం హత్యకు గురైందని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన స్థలంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించాగా ఆరుగురు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఫరీదాబాద్ ఎసిపి అనిల్ కుమార్ తెలిపారు. దర్పణ్ స్నేమిహుడు జిమ్ ట్రైనర్ ముఖేష్ హత్యలో నిందితుడిగా ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యలకు ముఖేష్ సుత్రదాని అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ కుటుంబాన్ని మొత్తం ఎందుకు హతమార్చారో వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. మర్డర్ ల వెనుక ఎవరో హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

Murdered Doctor Family of 4 Members by Gym Trainer