Thursday, April 25, 2024

మనోహరం.. మూసీ తీరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద: మూసీనది సమగ్ర ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. రెండు, మూడేళ్లలో మూసీనది మురికికూపం నుంచి పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. అందులో భాగంగా లండన్‌లోని ఏథెన్స్, పారిస్‌లోని సెయిన్ నదుల సుందరీకరణ కన్నా మరిన్ని రెట్ల అందంగా మూసీని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండునెలల క్రితం హెచ్‌ఎండిఏ అధికారులు పారిస్ నగరాన్ని సందర్శించి అక్కడ నదుల సుందరీకరణ గురించి ఆయా ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పాట్లు చేశాయి, ఎంతఖర్చు అవుతుంది, పర్యాటకుల కో సం ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలన్న విషయాల గురించి అధ్యయనం చేసి, నివేదిక రూ పొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణకు రూ.14,774 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. వచ్చే సంవత్సరం డిసెంబర్‌లోగా ఈ పనులను ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ప్ర స్తుతం మూసీ సుందరీకరణలో భాగంగా ఉద్యానవనాలు, వంతెనలు, ఆట స్థలాలు, సైకిల్‌ట్రాక్‌ల ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డిసిఎల్)ను ఏర్పా టు చేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో మూసీనది సుందరీకరణకు నడుం బిగించింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా సర్వే చేయగా 22 కి. మీలు, కబ్జాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు ఆరునెలల నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కబ్జాలు లేని చోట ఇప్పటికే మూ సీకి ఇరువైపులా ఉద్యానవనాలు ఏర్పాటుచేయడంతో పాటు సుందరీకరణకు పనులను ప్రభు త్వం చేపట్టింది. మూసీనది దిగువ ప్రాంతమైన బా పు ఘాట్ నుంచి హయత్‌నగర్ మండలం బాచా రం వరకు దాదాపు 53 కిలోమీటర్ల పొడవునా డ్రోన్లు, రెవెన్యూ, మూసీ సంస్థ సర్వేయర్లతో గతం లో సమగ్రంగా ప్రభుత్వం సర్వే నిర్వహించింది.

ఈ సర్వే ద్వారా ఎంఆర్‌డిసిఎల్ సంస్థ తమ దృష్టికి వచ్చిన మూసీనది ఆక్రమణలతో పాటు చేయాల్సిన అభివృద్ధి, జిహెచ్‌ఎంసి రోడ్లకు అనుసంధా నం చేసే సమగ్ర నివేదికనను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మూసీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయడంలో భాగంగా దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి చాదర్ ఘాట్ వరకు, నాగోల్ బ్రిడ్జి నుండి ఓఆర్‌ఆర్ వరకు మూసీలో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు, గుబురుగా పెరిగిన చెట్లు, పిచ్చిమొక్కలను అధికారులు తొలగించారు. 2017 వరకు బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు (22 కి.మీలు) మేర 6,700 ఆక్రమణలను గుర్తించగా, ప్రస్తుతం మరో 4,000ల పైచిలుకు ఆక్రమ కట్టడాలను ప్రభుత్వం గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News